Page Loader
శ్రీలంక లెజెండ్ అర్జున రణతుంగ రికార్డును అధిగమించిన దినేష్ చండిమాల్
92 బంతుల్లో 62 పరుగులు చేసిన చండిమాల్

శ్రీలంక లెజెండ్ అర్జున రణతుంగ రికార్డును అధిగమించిన దినేష్ చండిమాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 20, 2023
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో వెటరన్ శ్రీలంక బ్యాటర్ దినేష్ చండిమాల్ అర్ధ శతకంతో చెలరేగాడు. కేవలం 92 బంతుల్లో 62 పరుగులు చేశాడు. చండిమాల్‌కి టెస్టుల్లో ఇది 25వ అర్ధ సెంచరీ కావడం గమనార్హం. టెస్టు పరుగుల పరంగా శ్రీలంక లెజెండ్ అర్జున రణతుంగను కూడా అధిగమించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 580/4 స్కోరు డిక్లేర్ చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లోనే 164 మాత్రమే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్ ఫాలో ఆన్ చేయమని శ్రీలంకను కోరింది. రెండో ఇన్నింగ్స్‌లో చండిమాల్, ధనంజయ డి సిల్వా కలిసి (98) జతకట్టాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 126 పరుగులు జోడించడం విశేషం. బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్‌లో చివరికి చండిమాల్‌ ఔట్‌య్యాడు.

దినేష్ చండిమాల్

టెస్టుల్లో 5116 పరుగులు చేసిన దినేష్ చండిమాల్

దినేష్ చండిమాల్ 72 టెస్టు మ్యాచ్‌లు ఆడి 43.35 సగటుతో 5,116 పరుగులకు చేరుకున్నాడు. ఇందులో 13 సెంచరీలు, 25 అర్ధసెంచరీలను బాదాడు. టెస్టు పరుగుల పరంగా అతను అర్జున రణతుంగ (5,105)ను అధిగమించడం విశేషం. ఏంజెలో మాథ్యూస్ (7,118), దిముత్ కరుణరత్నే (6,230) మాత్రమే ఎక్కువ టెస్టు పరుగులు చేసి అతని కంటే ముందు స్థానంలో ఉన్నారు. రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 358 పరుగులకు ఆలౌట్ కావడంతో న్యూజిలాండ్ 58 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.