LOADING...
IND vs NZ: న్యూజిలాండ్‌ గెలవడం ఆశ్చర్యానికి గురి చేసింది : సునీల్‌ గావస్కర్
న్యూజిలాండ్‌ గెలవడం ఆశ్చర్యానికి గురి చేసింది : సునీల్‌ గావస్కర్

IND vs NZ: న్యూజిలాండ్‌ గెలవడం ఆశ్చర్యానికి గురి చేసింది : సునీల్‌ గావస్కర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 16, 2026
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజ్‌కోట్‌లో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత జట్టుపై న్యూజిలాండ్‌ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడిన భారత్‌ మొదట బ్యాటింగ్‌కి దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ (112) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. శుభ్‌మన్‌ గిల్‌ (56) వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్‌సెంచరీని సాధించాడు. కానీ రోహిత్‌ శర్మ (24), విరాట్‌ కోహ్లీ (23), శ్రేయస్‌ అయ్యర్‌ (8), రవీంద్ర జడేజా (27), నితీశ్‌ కుమార్‌ (20), హర్షిత్‌ రాణా (2) తదితర బ్యాటర్లు విఫలమయ్యారు.

Details

సెంచరీతో చెలరేగిన డారిల్ మిచెల్

కేఎల్‌ రాహుల్‌ ఓపికతో చేసిన ఒంటరి పోరాటం భారత జట్టు తక్కువ స్కోరుకే పరితమితమైంది. అయితే ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ బ్యాటర్లు అద్భుతంగా పరుగులు రాబట్టారు. ఓపెనర్లు డెవన్‌ కాన్వే (16), హెన్రీ నికోల్స్ (10) విఫలమైనప్పటికీ డారిల్‌ మిచెల్‌ (131*), విల్‌ యంగ్‌ (87) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు. ముఖ్యంగా మిచెల్‌ అజేయ సెంచరీతో అలరించాడు. కేవలం 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసి న్యూజిలాండ్‌ తేలికగా విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ విజయంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Details

న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు

న్యూజిలాండ్‌ చాలా తేలికగా భారత్‌ విధించిన లక్ష్యాన్ని ఛేదించడం నిజంగా ఆశ్చర్యం. బ్యాటింగ్‌కు రావడానికి ముందు అందరూ భారత జట్టు గెలుస్తుందనే భావనలో ఉన్నారు. పిచ్‌లోని మందకొడితనాన్ని భారత్‌ సానుకూలంగా ఉపయోగిస్తుందనుకున్నాం. కానీ అలా జరగలేదన్నారు. న్యూజిలాండ్‌ బౌలర్లు, స్పిన్నర్లు మాత్రమే కాకుండా సీమర్లు కూడా పిచ్‌లోని స్లోనెస్‌ను సద్వినియోగం చేసుకున్నారు. నేను నిజానికి భారత జట్టు న్యూజిలాండ్‌ను 260-270 పరుగులలో కట్టడి చేస్తుందనుకున్నాను. భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలుస్తుందని ఆశించాను. కానీ న్యూజిలాండ్‌ జట్టు 300 పరుగుల లక్ష్యమైనా చేధించేది అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.

Advertisement