Loading...
Asian Games 2026: గురి తప్పుతోందే.. ఆసియా క్రీడల్లో షూటర్లకు వరుస షాకులు
గురి తప్పుతోందే.. ఆసియా క్రీడల్లో షూటర్లకు వరుస షాకులు

Asian Games 2026: గురి తప్పుతోందే.. ఆసియా క్రీడల్లో షూటర్లకు వరుస షాకులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2026
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

బహుళ దేశాల క్రీడా పోటీలు ఏవైనా టీమిండియా పాల్గొంటున్నప్పుడు భారీ అంచనాలు ఉండే క్రీడల్లో షూటింగ్‌ కూడా ఒకటి. ఎన్నో ఏళ్లుగా ఒలింపిక్స్‌, ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో భారత షూటర్లు నిలకడగా రాణిస్తున్నారు. ఒలింపిక్స్‌ తర్వాత అత్యంత కఠినమైన క్రీడా పోటీలుగా భావించే ఆసియా క్రీడల్లో నాలుగేళ్ల క్రితం హాంగ్జౌలో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఏకంగా ఏడు స్వర్ణాలు సహా మొత్తం 22 పతకాలను సాధించి సత్తా చాటారు. ఈసారి అంతకుమించిన ప్రదర్శన చేస్తారని ఆశించినా.. భారత షూటర్లు ఇప్పటివరకు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఆసియా క్రీడల్లో ఇప్పటికే ఐదు రోజులు ముగిశాయి.

వివరాలు

స్టార్‌ షూటర్ల నుంచి ఊహించని నిరాశ

అయినప్పటికీ భారత్‌ ఖాతాలో ఒక్క స్వర్ణ పతకం కూడా చేరలేదు. ఇప్పటివరకు 4రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 8 పతకాలే భారత్‌కు లభించాయి.

కచ్చితంగా స్వర్ణ పతకం సాధిస్తారని భావించిన స్టార్‌ షూటర్లు కనీసం పతకం కూడా గెలవకుండా నిరాశపరచడం భారత శిబిరానికి పెద్ద షాక్‌గా మారింది.

ముఖ్యంగా పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను బాకర్‌, ప్రపంచ ఛాంపియన్‌ ఇషా సింగ్‌, సురుచి కలిసి బరిలోకి దిగిన మహిళల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత్‌కు ఒక్క పతకం కూడా దక్కలేదు.

మను బాకర్‌, ఇషా సింగ్‌ వంటి స్టార్‌ షూటర్లతో కూడిన భారత బృందం ఈ విభాగంలో పతకం సాధిస్తుందని భారీ అంచనాలు ఉండగా.. అవి నెరవేరలేదు.

వివరాలు

భారత్ కు అతిపెద్ద షాక్

ఆసియా క్రీడల్లో భారత్‌కు ఎదురైన అతిపెద్ద షాక్‌లలో ఇది ఒకటిగా నిలిచింది.

తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. కమల్‌జీత్‌, ఆకాశ్‌ భరద్వాజ్‌, కేదార్‌లింగ్‌తో కూడిన భారత త్రయం తీవ్ర నిరాశకు గురిచేసింది.

టీమ్‌ ఈవెంట్‌తో పాటు వ్యక్తిగత విభాగాల్లోనూ ఈ ముగ్గురికి రిక్తహస్తాలే మిగిలాయి.

ADVERTISEMENT

వివరాలు

మరికొన్ని విభాగాల్లోనూ చేజారిన పతకాలు

షూటింగ్‌లో మరికొన్ని విభాగాల్లోనూ భారత్‌కు పతకాలు చేజారాయి. కొన్ని ఈవెంట్లలో భారత షూటర్లు పసిడి అంచనాలను అందుకోలేకపోయారు.

దీంతో గత ఆసియా క్రీడల్లో సాధించిన ప్రదర్శనను ఈసారి అందుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యంగానే కనిపిస్తోంది.

అయితే ఇప్పటివరకు జరిగిన పోటీల ఫలితాలను చూసి భారత షూటర్లు నిరుత్సాహపడకుండా.. మిగిలిన విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

మిగిలిన ఈవెంట్లపై ఆశలు

షూటింగ్‌లో ఇంకా భారత్‌కు పతకాలపై ఆశలు ఉన్నాయి. రైఫిల్‌ ఈవెంట్లలో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌, రుద్రాంక్ష్‌లపై మంచి అంచనాలు ఉన్నాయి.

అలాగే 25 మీటర్ల పిస్టల్‌ వ్యక్తిగత విభాగాల్లో అనీష్‌ బన్వాలా, మను బాకర్‌, ఇషా సింగ్‌, రాహి సర్ణోబత్‌ బరిలోకి దిగాల్సి ఉంది.

పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌పైనా భారత్‌ ఆశలు పెట్టుకుంది. షాట్‌గన్‌లోనూ కొన్ని ఈవెంట్లలో భారత షూటర్ల నుంచి పతకాలు వచ్చే అవకాశముంది.

మొత్తంగా షూటింగ్‌ పోటీలు మరో వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు షూటింగ్‌లో ఎదురైన నిరాశను పక్కనపెట్టి మిగిలిన ఈవెంట్లలో భారత షూటర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఆసియా క్రీడలు ముగిసే సమయానికి షూటర్లు తమ ప్రదర్శనతో పతకాల లెక్కలను మార్చగలరేమో చూడాలి.

ADVERTISEMENT