
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు మ్యాచ్‌లు జరుగుతాయని ఐసీసీ ప్రకటించింది.
ఈ టోర్నీలో ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.
కాగా గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ జట్లు పోటీపడతాయి.
భారత్ మ్యాచ్‌లు ఇవే
ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ Vs భారత్ - దుబాయ్
మార్చి 2: న్యూజిలాండ్ vs భారత్ - దుబాయ్
వివరాలు
పూర్తి షెడ్యూల్ ఇదే
ఫిబ్రవరి 19 : పాకిస్థాన్ Vs న్యూజిలాండ్ -కరాచీ
ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ vs ఇండియా-దుబాయ్
ఫిబ్రవరి 21: అఫ్గానిస్థాన్ Vs దక్షిణాఫ్రికా - కరాచీ
ఫిబ్రవరి 22 : ఆస్ట్రేలియా Vs ఇంగ్లాండ్ - లాహోర్
ఫిబ్రవరి 23: పాకిస్థాన్ Vs భారత్ - దుబాయ్
ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్ Vs న్యూజిలాండ్ - రావల్పిండి
ఫిబ్రవరి 25: ఆస్ట్రేలియా Vs దక్షిణాఫ్రికా - రావల్పిండి
ఫిబ్రవరి 26: అఫ్గానిస్థాన్ Vs ఇంగ్లాండ్ - లాహోర్
ఫిబ్రవరి 27: పాకిస్థాన్ Vs బంగ్లాదేశ్ - రావల్పిండి
ఫిబ్రవరి 28: అఫ్గానిస్థాన్ Vs ఆస్ట్రేలియా - లాహోర్
మార్చి 1: దక్షిణాఫ్రికా Vs ఇంగ్లాండ్ - కరాచీ
మార్చి2: న్యూజిలాండ్ Vs భారత్ - దుబాయ్
వివరాలు
2026లో టీ20 ప్రపంచ కప్ భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తాయి
మార్చి 4: సెమీ ఫైనల్ - దుబాయ్ మార్చి 5: సెమీఫైనల్ 2-లాహోర్
మార్చి 9: ఫైనల్ -లాహోర్ ( భారత్ ఫైనల్‌కు వెళ్తే దుబాయ్)
భారత్ కోరినట్లుగా,వివాదాలకుతెర పడింది.ఐసీసీ 2024-27 మధ్య జరిగే ఈవెంట్లలో టోర్నీలు హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ పరిణామంలో,భారత్,పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లు తటస్థ వేదికలపై మాత్రమే జరగనున్నాయి.
2025లో జరిగే మహిళల క్రికెట్ ప్రపంచ కప్ భారత్‌లో,2026లో జరగబోయే టీ20 ప్రపంచ కప్ భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
ఈటోర్నీల కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించదు. తటస్థ వేదికలో పాక్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
ఇక 2028 టీ20 ప్రపంచ కప్ పాకిస్థాన్‌కు ఆతిథ్య హక్కులు ఇచ్చాయి.ఈ టోర్నీకి కూడా హైబ్రిడ్ మోడల్‌నే అనుసరించనుంది.