
Vaibhav vs Dhoni: ఒకరు ఫినిషింగ్ మాస్టర్, మరొకరు ఓపెనింగ్ స్పెషలిస్ట్.. ఎవరిది పైచేయి?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో ఆసక్తికర పోరు నేడు జరగబోతోంది.
రాత్రి 7:30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఇద్దరు విభిన్న తరాల క్రికెటర్లు ముఖాముఖి కావడమే.
చెన్నై తరఫున ఐపీఎల్ 2025లో అత్యంత వయస్కుడైన మహేంద్ర సింగ్ ధోనీ (43) ఆడబోతుండగా, రాజస్థాన్ తరఫున అత్యంత పిన్నవయస్కుడైన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తలపడనున్నాడు.
ఇది అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపుతోంది.
Details
ఢిల్లీలో మ్యాచ్
ఈ మ్యాచ్ మొదట చెపాక్ వేదికగా జరగాల్సి ఉండగా, బీసీసీఐ నిర్ణయం మేరకు ఐపీఎల్ పునఃప్రారంభం తర్వాత మిగిలిన మ్యాచ్‌లను కేవలం ఆరు వేదికలకే పరిమితం చేయడంతో, దిల్లీకి మార్చారు.
మరోవైపు, ఇది ధోనీకి చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చన్న ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో, అభిమానులు భారీగా స్టేడియానికి చేరే అవకాశముంది.
మార్చి 30న గువాహటిలో జరిగిన మొదటి లెగ్ మ్యాచ్‌లో చెన్నై తరఫున ధోనీ ఆడినా, అప్పట్లో రాజస్థాన్ తుదిజట్టులో వైభవ్ చోటు దక్కించుకోలేకపోయాడు.
అయితే, ఈ సీజన్ మధ్యలో వైభవ్ అరంగేట్రం చేసి తన యూత్ ఫైర్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు.
Details
ఐపీఎల్ లో శతకం బాదిన వైభవ్ సూర్యవంశీ
ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 219 స్ట్రైక్‌రేట్‌తో 195 పరుగులు చేసి, ఓ రికార్డు సెంచరీ కూడా ఖాతాలో వేసుకున్నాడు.
ఓపెనర్‌గా వెలిగిపోతున్న వైభవ్‌కు, ఫినిషర్‌గా గొప్ప పేరు తెచ్చుకున్న ధోనీకి మధ్య నేటి పోరు ఎంతో ఆసక్తికరంగా మారనుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు 13 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించింది.
ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన రాజస్థాన్‌కు నేడు జరగబోయే పోరే చివరి మ్యాచ్. చెన్నై కూడా మే 25న గుజరాత్ టైటాన్స్‌తో చివరి మ్యాచ్ ఆడనుంది.