Afghanistan vs India : పాకిస్థాన్ కంపెనీకి భారత్, అఫ్గనిసిస్థాన్ సిరీస్ మీడియా హక్కులు.. కారణమిదే..!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబరులో జరగనున్న టీ20 సిరీస్‌కు సంబంధించిన వాణిజ్య, అంతర్జాతీయ ప్రసార హక్కులను పాకిస్థాన్‌కు చెందిన ట్రాన్స్‌గ్రూప్ (TransGroup) సంస్థ దక్కించుకుంది. అయితే ఈ హక్కులను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆ సంస్థకు ఇవ్వలేదు. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) తన జట్టు ఆడే సిరీస్‌ల ప్రసార హక్కుల కోసం ట్రాన్స్‌గ్రూప్‌తో ఉన్న ఒప్పందం ప్రకారం ఈ బాధ్యతలను అప్పగించింది. సెప్టెంబరు రెండో వారంలో భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సాధారణంగా టీమిండియా ఆడే ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ లేదా జియోస్టార్ వంటి సంస్థలు పొందుతుంటాయి.
వివరాలు
ట్రాన్స్‌గ్రూప్‌కే ఎందుకు?
ఇరు జట్ల సిరీస్‌కు సంబంధించిన మీడియా, వాణిజ్య హక్కులు పాకిస్థాన్‌కు చెందిన ట్రాన్స్‌గ్రూప్ చేతికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డుకు ట్రాన్స్‌గ్రూప్ 'గ్లోబల్ మీడియా రైట్స్ సిండికేట్ పార్ట్‌నర్'గా వ్యవహరిస్తోంది.
ఈ భాగస్వామ్యం కారణంగానే అఫ్గానిస్థాన్ ఆడే సిరీస్‌ల అంతర్జాతీయ ప్రసార హక్కులను ఆ సంస్థకు అప్పగించింది.
ఈ వ్యవహారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
అయితే భారత్‌లో మాత్రం ట్రాన్స్‌గ్రూప్ నేరుగా ఈ సిరీస్‌ను ప్రసారం చేయదు.
దేశీయంగా సోనీ స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్ వేదికల ద్వారా మ్యాచ్‌లను అభిమానులు వీక్షించనున్నారు.
వివరాలు
సెప్టెంబరు 13 నుంచి సమరం..
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో జరగనున్నాయి.
ఇరు జట్ల మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ కావడం విశేషం. అయితే ఈ చారిత్రక సిరీస్ మ్యాచ్‌లకు అఫ్గానిస్థాన్ కాకుండా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
మూడు మ్యాచ్‌లు భారత గడ్డపైనే నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ప్రసార హక్కులు పాకిస్థాన్ సంస్థకు దక్కినప్పటికీ, భారత్‌లో సిరీస్ ప్రసార బాధ్యతలు మాత్రం సోనీ స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్ సంస్థల వద్ద ఉండనున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్..
Afghanistan vs India series in New Delhi on 13, 15 and 17 September. The Afghanistan Cricket Board has awarded commercial and TV production rights to Pakistan based Trans Group, which also holds PSL and PCB rights. To avoid media attention, Trans Group has routed the project…
— Vivek Bansal (@ivivekbansal) August 26, 2026