Loading...
Asian Games: ఫైనల్స్‌కు పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్‌పై ఘన విజయం
ఫైనల్స్‌కు పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్‌పై ఘన విజయం

Asian Games: ఫైనల్స్‌కు పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్‌పై ఘన విజయం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 01, 2026
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్‌లో పాకిస్థాన్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. వర్షం కారణంగా మైదానం తడిగా ఉండటంతో మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 13 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో తౌహిద్‌ హృదోయ్‌ 42పరుగులతో కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌ బౌలర్లలో సుఫ్యాన్‌ ముఖీమ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. అరాఫత్‌ మిన్హాస్‌ రెండు వికెట్లు తీశాడు. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఆరంభంలో కొన్ని వికెట్లు కోల్పోయినా.. అనంతరం బ్యాటర్లు లక్ష్యాన్ని సులభంగా అందుకున్నారు.

వివరాలు 

బంగ్లాదేశ్‌కు కాంస్యంపై ఆశలు

సైమ్‌ అయూబ్‌ 21 పరుగులు, మాజ్‌ సదాకత్‌ 15పరుగులతో జట్టు విజయానికి బాటలు వేశారు.

అనంతరం అబ్దుల్‌ సమద్‌ 30 పరుగులతో, హసన్‌ నవాజ్‌ 27పరుగులతో అజేయంగా నిలిచి పాకిస్తాన్‌ను విజయతీరాలకు చేర్చారు.

పాకిస్తాన్‌ 11.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మరోసారి ఏషియన్‌ గేమ్స్‌ స్వర్ణ పతకంపై ఆశలు నిలుపుకుంది.

సెమీఫైనల్లో ఓటమిపాలైనప్పటికీ బంగ్లాదేశ్‌కు పతకం సాధించే అవకాశం ఇంకా ఉంది.

భారత్‌,శ్రీలంక మధ్య ఇవాళ జరగనున్న రెండో సెమీఫైనల్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడుతుంది.

ఆ మ్యాచ్‌లో ఓడిన జట్టు బంగ్లాదేశ్‌తో కాంస్య పతకం కోసం పోటీ పడుతుంది. దీంతో పురుషుల క్రికెట్‌లో పతకాల పోరు మరింత ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT