
Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, 'ఆపరేషన్ సిందూర్' అనంతరం సరిహద్దుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
పాక్ జరిపిన కాల్పులకు ప్రతిస్పందనగా భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. భారత సైన్యం లాహోర్‌తోపాటు పాకిస్థాన్‌లోని అనేక కీలక నగరాలపై సమర్థవంతమైన దాడులు జరిపింది.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ భారత సైన్యానికి మద్దతుగా ట్వీట్ చేశారు.
పాకిస్థాన్‌కు మౌనంగా ఉండే అవకాశమున్నా, ఆ దేశం యుద్ధాన్ని ఎంచుకుందని వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించారు.
Details
భారత సైన్యం తగిన సమాధానం చెబుతుంది
ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ కలిసి పాకిస్థాన్‌కు మర్చిపోలేని బుద్ధి చెప్తాయని ఆయన పేర్కొన్నారు.
'పాకిస్థాన్ మౌనంగా ఉండొచ్చును. కానీ కాల్పుల ద్వారా ఉగ్రవాదులను కాపాడాలన్నదే వారి లక్ష్యం. ఇది వాళ్ల స్వభావాన్ని చూపిస్తుంది. మన సైన్యం తగిన సమాధానం ఇస్తోంది.
ఇది పాకిస్థాన్ ఎన్నటికీ మరిచిపోలేని రోజు అవుతుందంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Details
కరాచీలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
ఇక సరిహద్దు కాల్పుల తర్వాత భారత్ చేపట్టిన ప్రతీకార చర్యలు అత్యంత వ్యూహాత్మకంగా సాగుతున్నాయి.
భారత సైన్యం లాహోర్, కరాచీ నగరాలపై తీవ్రమైన దాడులు జరిపింది.
కరాచీలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కరాచీ పోర్టులో 8 నుంచి 12 శక్తివంతమైన పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం.
ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి చేపట్టిన దాడులు పాక్‌ను గుండె గుబురుగా మారేలా చేశాయి. భారత్ చేపట్టిన దాడులతో పాకిస్థాన్ దిగ్భ్రాంతికి గురైంది.
వారి సైనిక దురాక్రమణకు తగిన రీతిలో సమాధానం ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో దాయాది దేశానికి కఠినమైన బుద్ధి చెబుతామని సంకేతాలు ఇచ్చింది.