LOADING...
Palash Muchhal : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పలాశ్ ముచ్చల్.. వివాహంపై ఇరు కుటుంబాల్లో నిశ్శబ్దం!
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పలాశ్ ముచ్చల్.. వివాహంపై ఇరు కుటుంబాల్లో నిశ్శబ్దం!

Palash Muchhal : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పలాశ్ ముచ్చల్.. వివాహంపై ఇరు కుటుంబాల్లో నిశ్శబ్దం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2025
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధానతో జరగాల్సిన ఆయన వివాహం వాయిదా పడిన నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడి, అలసట కారణంగా పలాశ్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ప్రారంభంగా సాంగ్లీ ఆసుపత్రిలో చేరించిన పలాశ్‌ను తరువాత మెరుగైన చికిత్స కోసం ముంబై గోరెగావ్‌లోని ఎస్‌ఆర్‌వీ ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఆయన పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు ఇంటికి పంపినట్లు పలాశ్ బృందం అధికారికంగా ప్రకటించింది. పెళ్లి రోజునే ఇరు కుటుంబాల్లో అనూహ్యంగా తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా స్మృతి-పలాశ్ వివాహాన్ని వాయిదా వేశారు. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానకు ఆ రోజు గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

Details

పూర్తిగా కోలుకొనే వరకు వేచి ఉండాలని నిర్ణయం

ఇదే సమయంలో పలాశ్ ముచ్చల్ కూడా ఎసిడిటీ, వైరల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. స్మృతి తండ్రి ఆరోగ్య స్థితి తెలిసిన వెంటనే వివాహాన్ని వాయిదా వేయాలని మొదటగా పలాశ్‌నే నిర్ణయించినట్లు ఆయన తల్లి అమితా ముచ్చల్ తెలిపారు. పలాశ్‌కు స్మృతి తండ్రితో చాలా గాఢమైన అనుబంధం ఉంది. స్మృతి కంటే వారిద్దరే ఎక్కువ క్లోజ్. ఆయనకు సమస్య వచ్చిందని తెలిసిన వెంటనే, పెళ్లిని ఆపాలని పలాశ్ ముందే చెప్పాడు. ఆయన పూర్తిగా కోలుకునే వరకు వేచి చూడాలని నిర్ణయించారని ఆమె వివరించారు. ఆ విషయం తెలుసుకున్న వెంటనే పలాశ్ భావోద్వేగానికి లోనై ఏడ్చేశాడు. అతని ఏడుపుతో ఆరోగ్యం మరింత దెబ్బతింది.

Details

 వైద్యుల పర్యవేక్షణలో నాలుగు గంటలు  

ఆసుపత్రిలో నాలుగు గంటలపాటు పర్యవేక్షణలో ఉంచాల్సి వచ్చింది. ఐవీ డ్రిప్ ఇచ్చారు. ఈసీజీ సహా ఇతర పరీక్షలు చేశారు. రిపోర్టులు అన్నీ సాధారణంగానే వచ్చినా, తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే ఆరోగ్యం కుప్పకూలిందని అమితా ముచ్చల్ తెలిపారు. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే వైద్యులు పలాశ్‌ను తమ పర్యవేక్షణలో ఉంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. ఇదిలావుండగా, వివాహ వాయిదాపై ఇప్పటివరకు పలాశ్ ముచ్చల్ గానీ, స్మృతి మంధాన గానీ అధికారిక ప్రకటన చేయలేదు.