PCB: పాకిస్తాన్ బ్యాటర్‌కు భారీ జరిమానా.. పాలస్తీనా గుర్తును వాడినందుకే!
కరాచిలోని నేషనల్ స్టేడియంలో ఆదివారం కరాచీ వైట్స్, లాహోర్ బ్లూస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో పాకిస్థాన్ వికెట్ కీపర్ అజం ఖాన్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారీ జరిమానా విధించింది. అజామ్ తన బ్యాట్‌పై పాలస్తీనా జెండాను ప్రదర్శించిన కారణంగా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. అతని బ్యాట్‌పై పాలస్తీనా లోగో ఉందని, ఇది ఐసీసీ ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించడమేనని పీసీబీ పేర్కొంది. గత రెండు మ్యాచ్‌లలో కూడా అజామ్ ఇదే స్టిక్కర్‌ను ఉపయోగించాడని, అయితే ఆదివారం మ్యాచ్‌కు ముందు అధికారులు తమకు సమాచారం ఇవ్వలేదని అజామ్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు సిద్ధమైన పాక్
మరోవైపు వన్డే వరల్డ్ కప్ 2023లో శ్రీలంకపై పాక్ అద్భుతమైన విజయం సాధించిన తర్వాత పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విజయాన్ని గాజాలోని ప్రజలకు అంకితం చేసినట్లు ప్రకటించాడు. ఇదిలా ఉండగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్ధమైంది. ఈ వారం చివర్లో ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు పాక్ ప్లేయర్లు సిద్ధమయ్యారు.