
PBKS vs CSK: పంజాబ్ విజయం.. చెన్నైకి వరుసగా నాలుగో ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తమ మూడో విజయం నమోదు చేసుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 18 పరుగుల తేడాతో గెలుపొందింది.
అంతకముందు పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
ప్రియాంశ్ ఆర్య (103)శతకం చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే చేయగలిగింది.
డెవాన్ కాన్వే 69 పరుగుల వద్ద రిటైర్డ్ ఔట్ అయ్యాడు. శివమ్ దూబె 42, రచిన్ రవీంద్ర 36, ధోనీ 27: రాణించారు.
పంజాబ్ బౌలర్లలో ఫెర్గూసన్ 2,మాక్స్‌వెల్,యశ్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు.చెన్నైకి ఇది వరుసగా నాలుగో ఓటమి.
వివరాలు
పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య శతకం
మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (103) శతకంతో చెలరేగగా లోయర్ ఆర్డర్ బ్యాటర్ శశాంక్ సింగ్ (52*) హాఫ్ సెంచరీ సాధించాడు.
ఎనిమిదో స్థానంలో వచ్చిన మార్కో యాన్సెస్ (34*) దూకుడుగా ఆడాడు.
ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (9), స్టాయినిస్ (4), నేహల్ వధేరా (9), మ్యాక్స్‌వెల్ (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.
సీఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, అశ్విన్ 2, నూర్ అహ్మద్, ముకేశ్ చౌదరి చెరో వికెట్ పడగొట్టారు.