తదుపరి వార్తా కథనం
PBKS vs LSG: లక్నో ధాటికి పంజాబ్ బౌలర్లు విలవిల: 258పరుగుల లక్ష్యాన్ని సెట్ చేసిన లక్నో
వ్రాసిన వారు
Sriram Pranateja
Apr 28, 2023
09:46 pm
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచిన పంజాబ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది .
బ్యాటింగ్ కు దిగిన లక్నో, 20ఓవర్లు ముగిసే సమయానికి 5వికెట్లు కోల్పోయి 257పరుగులు చేసింది.
41పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (12పరుగులు) ఔటయ్యాడు. కైల్ మేయర్స్ 54పరుగులు (24బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు), ఆయూష్ బదోనీ 43పరుగులు (24బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు), మార్కస్ స్టాయినిస్ 72పరుగులు (40బంతుల్లో 6ఫోర్లు, 5సిక్సర్లు), నికోలస్ పూరన్ 45పరుగులు (19బంతుల్లో 7ఫోర్లు 1సిక్సర్) తో చెలరేగడంతో భారీ స్కోరు సాధించింది లక్నో సూపర్ జెయింట్స్.
పంజాబ్ బౌలర్లలో రబాడా 2, కరేన్, లివింగ్ స్టోన్, అర్ష్ దీప్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పంజాబ్ పై 257పరుగులు చేసిన లక్నో
Yes, no typos! We have scored 2⃣5⃣7⃣ 🔥 pic.twitter.com/BfPFiLYFjb
— Lucknow Super Giants (@LucknowIPL) April 28, 2023