LOADING...
Sujan Mukherjee: నిర్దేశాల ప్రకారం పిచ్ సిద్ధం చేశా : ముఖర్జీ
నిర్దేశాల ప్రకారం పిచ్ సిద్ధం చేశా : ముఖర్జీ

Sujan Mukherjee: నిర్దేశాల ప్రకారం పిచ్ సిద్ధం చేశా : ముఖర్జీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2025
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

స్వదేశంలో టీమిండియా నిరాశపరిచింది. 124 పరుగుల చిన్న లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయి సౌతాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో ఈడెన్ గార్డెన్స్‌లో అవమానకర ఓటమి చవిచూసింది. ఈ పరాజయానికి కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని కొందరు విమర్శిస్తుండగా... మరికొందరు మాత్రం పిచ్‌పైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ ఈసారి బౌలర్లకు పూర్తి అనుకూలంగా మారిపోయిందని క్రికెట్ మాజీలు, అభిమానులు సోషల్ మీడియాలో మండిపడ్డారు. ఈ వివాదాల నడుమ ఎట్టకేలకు పిచ్ క్యురేటర్‌ సుజన్ ముఖర్జీ స్పందించాడు.

Details

'నా పని నిజాయతీగా చేశా': ముఖర్జీ

'ఈడెన్ పిచ్ అంతగా నాసిరకమేమీ కాదు. అందరూ ఏకపక్షంగా విమర్శిస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ కోసం ఎలాంటి పిచ్ కావాలో నాకు బాగా తెలుసు. భారత జట్టు శిబిరం కోరినట్లుగానే పిచ్ సిద్ధం చేశాను. బయటి విమర్శలను నేను పట్టించుకోను. అందరికీ పిచ్ సైన్స్‌ తెలియదు. నేను నా పనిని పూర్తి నిబద్ధతతో చేశా. భవిష్యత్తులోనూ అలా కొనసాగిస్తానని ముఖర్జీ తెలిపాడు.

Details

క్యురేటర్‌ను తప్పుపట్టలేం

బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా క్యురేటర్‌కు అండగా నిలిచాడు. 'భారత శిబిరం ఏ రకం పిచ్ కోరిందో, అతను అదే ఇచ్చాడు. మ్యాచ్‌కు ముందు నాలుగు రోజుల పాటు పిచ్‌కు నీరు పట్టలేదు. అందుకే అది ఇలా మారిపోయింది. ఈ విషయంలో ముఖర్జీని తప్పుపట్టాల్సిన అవసరం లేదని గంగూలీ స్పష్టం చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాడు. 'మా సూచనలు ఎలా ఉన్నాయో, పిచ్ కూడా అలాగే తయారైంది. ఇది బ్యాటర్లకు అసాధ్యమైన పిచ్ కాదు. కాస్త ఓపిగ్గా ఆడితే పరుగులు వస్తాయని గంభీర్ వివరించాడు.