Pakistan team: ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శన.. పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు
వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ (Pakistan) దారుణ వైఫల్యంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) ఇప్పటికే తమ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రధాన కోచ్ మిక్కీ ఆర్థర్, బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కూడా వైదొలిగారు. దీంతో పాకిస్థాన్ జట్టును ప్రక్షాళన చేసేందుకు పీసీబీ కంకణం కట్టుకుంది. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన జట్టును చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ ప్రకటించాడు. కెప్టెన్‌గా షాన్ మసూద్ వ్యవహరించనున్నాడు.
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్
సైమ్ అయూబ్, ఖుర్రం షాజాద్‌లు తొలిసారిగా జాతీయ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్, స్మిన్ బౌలింగ్ కోచ్‌గా సయీద్ అజ్మల్ నియమితులయ్యారు. పాకిస్థాన్ టెస్టు జట్టు షాన్ మసూద్ (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వాసిమ్ జూనియర్, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, షాహీన్ ఆఫ్రిది