
Ravindra Jadeja: ఇన్‌స్టాలో పోస్టు.. టెస్టులకు జడేజా గుడ్‌బై చెబుతాడా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల టీమిండియాకు చెందిన ఇద్దరు కీలక ఆటగాళ్లు వరుసగా టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.
మొదట రోహిత్ శర్మ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇప్పుడు రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గురువారం జడేజా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో టెస్ట్ జెర్సీలో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఇది చూసిన వెంటనే అభిమానుల్లో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
టెస్ట్ ఫార్మాట్‌లో రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? అనే చర్చలు తెరపైకి వచ్చాయి.
విరాట్, రోహిత్ లాంటి సీనియర్లు వెనుదిరిగిన తరుణంలో జడేజా కూడా అదే దారిలో నడవనున్నాడా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Details
టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే ఉన్న జడేజా
జడేజా ఇటీవలే ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో 1,151 రోజులు అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న ఘనతను సాధించాడు.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది సరికొత్త రికార్డు. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటికీ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు.
ఈ సమయంలోనే తన టెస్ట్ జెర్సీ ఫొటోను షేర్ చేయడం, విరాట్-రోహిత్ రిటైర్మెంట్ తరువాత రావడం అభిమానుల్లో అనుమానాలు పెంచుతున్నాయి.
Details
టెస్టుల్లో సీనియర్ ఆటగాడిగా జడేజా
36 ఏళ్ల జడేజా, విరాట్ కోహ్లీ అండర్-19 జట్టు నుంచి సహచరుడిగా ఉంటూ వచ్చాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న అత్యంత సీనియర్ ఆటగాళ్లలో అతనొకరు.
గతేడాది విరాట్, రోహిత్‌లు టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన వెంటనే జడేజా కూడా అదే చేస్తూ టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు టెస్ట్‌ల నుంచి వారిద్దరూ తప్పుకున్న నేపథ్యంలో జడేజా భవిష్యత్‌పై మరింత ఆసక్తి పెరిగింది.
అభిమానులలో ఆందోళన
జడేజా పోస్ట్ చూసిన అభిమానులు, 'ఇతనూ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడా?' అనే ప్రశ్నలతో సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
టెస్ట్ ఫార్మాట్‌లో అతని ప్రదర్శన ఇంకా బలంగా ఉన్నప్పటికీ, ఈ విధమైన సంకేతాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.