Loading...
Para Asian Games 2026: ప్రవీణ్‌ కుమార్‌ 'గోల్డ్' రికార్డు.. ఐదో ప్లేస్‌కు భారత్
ప్రవీణ్‌ కుమార్‌ 'గోల్డ్' రికార్డు.. ఐదో ప్లేస్‌కు భారత్

Para Asian Games 2026: ప్రవీణ్‌ కుమార్‌ 'గోల్డ్' రికార్డు.. ఐదో ప్లేస్‌కు భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. మూడో రోజు కూడా భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో రికార్డులు సృష్టిస్తూ పతకాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలో పతకాల పట్టికలో భారత్‌ ఐదో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు భారత్‌ మొత్తం 47 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. వీటిలో 12 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్య పతకాలు ఉన్నాయి.

వివరాలు

నేటి బంగారు పతకాలు ఇవే..

పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌ హైజంప్‌లో సత్తా చాటాడు. టీ64 విభాగంలో 2.05 మీటర్ల ఎత్తును అధిగమించి పారా ఆసియా క్రీడల రికార్డును నెలకొల్పడంతో పాటు బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇదే విభాగంలో భారత్‌కే చెందిన మరో అథ్లెట్‌ బంటి 1.92 మీటర్ల ఎత్తు దూకి రజత పతకాన్ని సాధించాడు.

షాట్‌పుట్‌ ఎఫ్‌53 విభాగంలో భారత అథ్లెట్‌ ఆయుష్‌ వర్మ స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు.

ఫైనల్లో 8.16 మీటర్ల దూరం షాట్‌పుట్‌ను విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రీడల్లో ఆయుష్‌కు ఇది రెండో పతకం కావడం విశేషం.

వివరాలు

 మూడు పతకాలు సొంతం

అంతకుముందు రోజు జావెలిన్‌ త్రో ఎఫ్‌53/54 విభాగంలో అతడు కాంస్య పతకాన్ని సాధించాడు.

షాట్‌పుట్‌ ఎఫ్‌46 విభాగంలోనూ భారత అథ్లెట్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ఈ విభాగంలోని మూడు పతకాలనూ భారత క్రీడాకారులే సొంతం చేసుకున్నారు.

ఖిలారి 15.87 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించగా.. మహ్మద్‌ యస్సిర్‌ 15.06 మీటర్లతో రజతం, ప్రవీణ్‌ 14.94 మీటర్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు

శీతల్‌ దేవి - పాయల్‌ నాగ్‌ జోడీకి రజతం

మహిళల కాంపౌండ్‌ డబుల్స్‌ ఆర్చరీలో భారత జోడీ శీతల్‌ దేవి - పాయల్‌ నాగ్‌ రజత పతకంతో సరిపెట్టుకుంది.

ఫైనల్‌లో చైనాకు చెందిన ఝావో జింగ్‌ - జికియింగ్‌ జోడీ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

మహిళల షాట్‌పుట్‌ విభాగంలో భారత అథ్లెట్‌ భాగ్యశ్రీ రాణించింది. ఫైనల్లో 8.19 మీటర్ల దూరం షాట్‌పుట్‌ను విసిరి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

మొత్తంగా మూడో రోజు భారత అథ్లెట్లు హైజంప్‌, షాట్‌పుట్‌, ఆర్చరీ వంటి విభాగాల్లో పతకాలు సాధిస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. దీంతో భారత్‌ పతకాల సంఖ్య 47కు చేరగా, పతకాల పట్టికలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది.

ADVERTISEMENT