Prithvi Shaw: మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్.. బ్రేకప్‌కు బ్రేక్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw), టాలీవుడ్ నటి ఆకృతి అగర్వాల్ (Akriti Agarwal) మళ్లీ ఒక్కటయ్యారు. కొన్ని వారాల క్రితం నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న ఈ జంట.. తాజాగా తమ బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. సన్నిహితులు చెప్పిన మాటలు విని తాను తప్పుగా ఆలోచించానని, పృథ్వీతో నేరుగా మాట్లాడకుండా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడం తన పొరపాటని ఆమె అంగీకరించారు. తన నిర్ణయం వల్ల పృథ్వీ షా బాధపడటానికి తానే బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తామిద్దరం మాట్లాడుకున్నామని, పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నామని ఆకృతి వెల్లడించారు.
వివరాలు
విడిపోతున్నట్లు గతంలో ప్రకటన
తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, తమ నిర్ణయంపై ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయవద్దని అభిమానులను కోరారు.
ఈ సందర్భంగా ఆకృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టును పృథ్వీ షా సైతం షేర్ చేశారు. కాగా, పృథ్వీ షాకు, నటి ఆకృతి అగర్వాల్‌కు మార్చి 8న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
అయితే తమ భవిష్యత్తు లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నాయని చెబుతూ.. తామిద్దరం విడిపోతున్నట్లు ఆకృతి అగర్వాల్ సెప్టెంబరులో ప్రకటించారు.
దీంతో ఈ జంట బంధానికి ముగింపు పడిందని అందరూ భావించారు.
తాజాగా ఇద్దరూ తమ మధ్య విభేదాలను పరిష్కరించుకుని మళ్లీ ఒక్కటవడంతో ఈ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది.