పృథ్వీషాపై రివర్స్ కేసు.. అసభ్యంగా తాకాడని ఆరోపణ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ క్రికెటర్ పృథ్వీ షా సెల్పీ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ కేసులో నిందితురాలైన యూట్యూబర్ సప్నా గిల్ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సప్నా గిల్, క్రికెటర్ పృథ్వీషా ని సెల్ఫీ అడగ్గా.. అతను నిరాకరించాడు. దీంతో పృథ్వీ షా స్నేహితుడి కారును ధ్వంసం చేశాడు. తాజాగా ఈ వివాదంపై సప్నా గిల్ తిరిగి పృథ్వీషాపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
సప్నాగిల్ మాట్లాడుతూ ఫిబ్రవరి తాను క్లబ్ కు వెళ్లానని, అప్పుడు పృథ్వీ షా మద్యం మత్తులో ఉన్నట్లు పేర్కొంది. శోభిత్ ఠాకూర్ సెల్ఫీ కోసం పృథ్వీషాను సంప్రదించగా వాగ్వాదానికి దిగడంతో పృథ్వీ షా మొబైల్ ఫోన్‌ని నేలపై పాడేశాడని వాపోయింది.
పృథ్వీ షా
పృథ్వీ షా అసభ్యంగా తాకాడని ఆరోపణ
పృథ్వీ షా స్నేహితులు తమపై దాడి చేశారని, ఆ సమయంలో పృథ్వీ షా తనను అనుచితంగా తాకాడని సప్నాగిల్ తెలిపింది.
తన పరువు, మర్యాదలకు భంగం కలిగించినందుకు గానూ పృథ్వీ అతడి స్నేహితులపై కేసు నమోదు చేయాలని అభ్యర్థించారు. అయితే దీనిపై పోలీసులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
పృథ్వీషా స్నేహితుడు ఆశిష్ యాదవ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరి 17న సప్నా గిల్‌ను అరెస్టు చేశారు. ఈ అరెస్టు కారణంగానే తన ఫిర్యాదు చేయడం ఆలస్యమైందని ఆమె తెలిపింది