Loading...
PSL 12 Schedule : పీఎస్ఎల్ 12వ సీజన్ తేదీలు ఖరారు.. ఐపీఎల్‌తో మరోసారి పోటీ
పీఎస్ఎల్ 12వ సీజన్ తేదీలు ఖరారు.. ఐపీఎల్‌తో మరోసారి పోటీ

PSL 12 Schedule : పీఎస్ఎల్ 12వ సీజన్ తేదీలు ఖరారు.. ఐపీఎల్‌తో మరోసారి పోటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

పీఎస్ఎల్ 12వ సీజన్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది మార్చి 18 నుంచి మే 2 వరకు పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వహించనున్నారు. దీంతో ఈసారి కూడా పీఎస్ఎల్‌కు ఐపీఎల్ షెడ్యూల్‌తో పోటీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్‌లో ప్రవేశపెట్టిన 8 జట్ల ఫార్మాట్‌నే కొనసాగించనున్నారు. పీఎస్ఎల్ 12వ సీజన్ తేదీలు ఖరారు పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 12వ ఎడిషన్‌కు తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది మార్చి 18 నుంచి మే 2 వరకు మెగా టోర్నమెంట్ జరగనుంది. లండన్‌లో సెప్టెంబర్ 1న నిర్వహించిన పీఎస్ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 8 ఫ్రాంచైజీల యజమానులు, ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

వివరాలు 

8 జట్లతోనే తదుపరి సీజన్

పీఎస్ఎల్ 11వ సీజన్‌లో తొలిసారి 8 జట్ల ఫార్మాట్‌ను తీసుకొచ్చారు. గతంలో అమల్లో ఉన్న డ్రాఫ్ట్ విధానానికి బదులుగా ఆటగాళ్ల వేలం పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు.

అదే విధానాన్ని కొనసాగిస్తూ 12వ సీజన్‌లోనూ 8 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.

తొమ్మిదేళ్ల తర్వాత పెషావర్ జల్మీకి టైటిల్

పీఎస్ఎల్ 11వ సీజన్ ఫైనల్ మే నెలలో గడాఫీ స్టేడియంలో జరిగింది.

ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్‌ను ఓడించిన పెషావర్ జల్మీ ఛాంపియన్‌గా నిలిచింది.

దీంతో ఆ జట్టు తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్న టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌ను 32,461 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు.

వివరాలు 

పీఎస్ఎల్ 12 మరింత ఘనంగా..

పీఎస్ఎల్ 12వ సీజన్ తేదీలు ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మోహసిన్ నఖ్వీ స్పందించారు.

పీఎస్ఎల్ 11వ సీజన్ ద్వారా ఈ లీగ్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

రికార్డు స్థాయిలో ప్రేక్షకులు, ప్రసారాలతో దేశవ్యాప్తంగా టోర్నీపై ఆసక్తి పెరిగిందన్నారు.

పీఎస్ఎల్ 12లో ఆ స్థాయిని మరింత పెంచి మరో అద్భుతమైన సీజన్‌ను అందిస్తామని తెలిపారు.

వేలం, రిటెన్షన్‌కు లైన్ క్లియర్

టోర్నమెంట్ తేదీలు ఖరారు కావడంతో ఫ్రాంచైజీలకు కీలకమైన ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి.

ఆటగాళ్ల రిటెన్షన్, ట్రేడ్ విండో, వేలం వంటి అంశాలకు ఇప్పుడు మార్గం సుగమమైంది. దీంతో వచ్చే సీజన్ కోసం జట్ల కూర్పుపై ఫ్రాంచైజీలు దృష్టి సారించనున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

మరోసారి ఐపీఎల్‌తో క్లాష్?

పీఎస్ఎల్ షెడ్యూల్ ప్రకటనతో మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.

మార్చి 18 నుంచి మే 2 వరకు పీఎస్ఎల్ జరగనుండటంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) షెడ్యూల్‌తో మరోసారి తేదీలు ఢీకొనే అవకాశం ఉంది.

దీంతో రెండు టీ20 లీగ్‌ల మధ్య ఆటగాళ్ల లభ్యత, క్రికెట్ అభిమానుల ఆసక్తి వంటి అంశాలు చర్చనీయాంశంగా మారనున్నాయి.

పీఎస్ఎల్ 12వ సీజన్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్, ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి జట్లు పాల్గొననున్నాయి.

ADVERTISEMENT