LOADING...
CSK vs PBKS : చైన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం
చైన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం

CSK vs PBKS : చైన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2025
11:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన చైన్నై 19.2 ఓవర్లలో 190 పరుగులు చేసి ఆలౌటైంది. లక్ష్య చేధనలో పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (72), ప్రభుమాన్ సింగ్(54) రాణించడంతో పంజాబ్ సునాయాసంగా విజయం సాధించింది. చైన్నై బౌలర్లో పతిరణ, ఖలీల్ అహ్మద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, నూర్ ఆహ్మద్, జడేజా ఓ వికెట్ తీశారు.

Details

ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన చైన్నై

ఈ సీజన్ లో చైన్నై సూపర్ కింగ్స్ ఎనిమిదో పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో ప్లే ఆఫ్ రేసు నుంచి చైన్నై నిష్క్రమించింది. చైన్నైపై విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండు స్థానానికి ఎగబాకింది

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపు