
RCB-PBKS: సొంత గడ్డపై చతికిల పడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్-18లో భాగంగా బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు పరిమితం చేశారు.ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది.
ఈ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ అద్భుతంగా ఆడి,అర్ధశతకం(50 నాటౌట్)సాధించి జట్టును ముందుండి నడిపించాడు.
బౌలింగ్‌లో పంజాబ్ జట్టు అదరగొట్టింది.అర్ష్‌దీప్ సింగ్,యాన్సెన్,చాహల్,హర్‌ప్రీత్ బ్రార్ చెరో రెండు వికెట్లు తీసి బెంగళూరును ఒత్తిడిలోకి నెట్టారు.
బార్ట్‌లెట్ ఒక్క వికెట్ పడగొట్టాడు.95పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 12.1ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
ఛేజ్‌లో నేహల్ వధేరా కీలకంగా రాణించి 33పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలుపు
Punjab Kings won by 5 wickets.
— Nabi Raza Khan🇮🇳 (@NabiRazaKhan1) April 18, 2025
14 overs game due to rain 🌧️ #RCBvPBKS pic.twitter.com/SkYxbWi5Yo