Loading...
PV Sindhu: రాజమౌళి సినిమాకు పీవీ సింధు గ్రీన్ సిగ్నల్.. హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలంటూ సరదా ట్వీట్!
రాజమౌళి సినిమాకు పీవీ సింధు గ్రీన్ సిగ్నల్.. హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలంటూ సరదా ట్వీట్!

PV Sindhu: రాజమౌళి సినిమాకు పీవీ సింధు గ్రీన్ సిగ్నల్.. హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలంటూ సరదా ట్వీట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2026
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత బ్యాడ్మింటన్ స్టార్ 'పివి.సింధు' మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఈసారి ఆమె కోర్టులో కాదు.. సరదాగా చేసిన ఓ ట్వీట్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. దర్శకధీరుడు 'ఎస్‌ఎస్ రాజమౌళి' తనపై కురిపించిన ప్రశంసలకు స్పందిస్తూ, ఆయన సినిమాలో నటించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చమత్కారంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

వివరాలు

జపాన్ ఓపెన్ విజేతకు రాజమౌళి అభినందనలు

ఇటీవల జరిగిన జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన తొలి భారతీయురాలిగా పీవీ సింధు చరిత్ర సృష్టించారు.

ఈ ఘనత సాధించిన ఆమెను అభినందిస్తూ రాజమౌళి సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ చేశారు.

జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా నిలిచిన పీవీ సింధుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. అద్భుతమైన కమ్‌బ్యాక్. భారతదేశం నీపై గర్విస్తోందంటూ ఆయన ప్రశంసలు కురిపించారు.

వివరాలు

'బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే నన్నే తీసుకోండి'

రాజమౌళి ట్వీట్‌కు పీవీ సింధు కూడా సరదాగా స్పందించారు. థ్యాంక్యూ సో మచ్ రాజమౌళి సార్. మీ 'వారణాసి' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

ఒకవేళ మీ సినిమాలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే నన్నే తీసుకోండి. అవసరమైతే కొత్త హీరోయిన్‌గా నటించేందుకు కూడా నేను రెడీ అంటూ నవ్వుతున్న ఎమోజీలతో ట్వీట్ చేశారు.

సింధు చేసిన ఈ ఫన్నీ కామెంట్‌ను అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

'వారణాసి'పై భారీ అంచనాలు

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తోంది.

ఇందులో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

దాదాపు రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా, వారణాసి వంటి విభిన్న ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కుతోంది.

ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ADVERTISEMENT

వివరాలు

నెటిజన్లలో ఆసక్తికర చర్చ

రాజమౌళి సినిమాల్లో ప్రతి పాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో, పీవీ సింధు చేసిన ఈ సరదా ఆఫర్‌పై అభిమానులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

గతంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ 'డేవిడ్ వార్నర్' కూడా రాజమౌళి సినిమాలో నటించాలని ఆసక్తి వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు పీవీ సింధు కూడా అదే జాబితాలో చేరిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'వారణాసి' సినిమా గురించి వస్తున్న ప్రతి చిన్న అప్‌డేట్ వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో పీవీ సింధు చేసిన ఈ సరదా ట్వీట్ నిజంగానే భవిష్యత్తులో సినిమాగా రూపుదిద్దుకుంటుందా? సోషల్ మీడియా సరదా సంఘటనగానే మిగిలిపోతుందా? అనే చర్చ ప్రస్తుతం నెటిజన్లలో సాగుతోంది.

ADVERTISEMENT