Sanju Samson: క్వార్టర్ ఫైనల్ హీరొస్.. యువరాజ్ నుంచి కోహ్లీ, ఇప్పుడు సంజు కూడా అదే స్టైల్!
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ 'క్వార్టర్ ఫైనల్'లో వెస్టిండీస్‌పై సాధించిన ఘన విజయంలో సంజు శాంసన్ పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. అజేయంగా 97 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చిన అతడు, చివరి బౌండరీ కొట్టిన వెంటనే చేసిన విజయనాదం క్రికెట్ అభిమానులకు గతంలోని ఇద్దరు మహా ఇన్నింగ్స్‌లను గుర్తు చేసింది. ఆ స్టార్లు ఎవరు? వారు ఎలా జట్టును గెలిపించారో ఒకసారి చూసేద్దాం.
Details
ఫస్ట్ బ్యాటర్ యువీ - 2011 ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై మహా పోరాటం
ఎంఎస్. ధోని నాయకత్వంలో భారత్ 2011 వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. క్వార్టర్ ఫైనల్‌లో బలమైన ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టుతో తలపడాల్సి వచ్చింది. ఐసీసీ టోర్నీల్లో ఆసీస్ జోరు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. 261 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు సచిన్ టెండూల్కర్ (53), గౌతమ్ గంభీర్ (50)హాఫ్ సెంచరీలతో మంచి ఆరంభం లభించింది. అయితే మధ్యలో అనూహ్యంగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఆ సమయంలో యువరాజ్ సింగ్ (57*) క్రీజ్‌లో నిలిచి, సురేష్ రైనాతో (34*)తో కలిసి జట్టును గెలుపు వైపు నడిపించాడు. బ్రెట్ లీ, షాన్ టైట్, మిచెల్ జాన్సన్‌లాంటి వేగవంతుల్ని ధైర్యంగా ఎదుర్కొని యువీ జట్టుకు విజయాన్ని అందించాడు.
Details
ఈసారి కింగ్ కోహ్లీ ఆసీస్‌పై అదిరిపోయిన ఇన్నింగ్స్
బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత చేసిన సింహనాదం అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 2016 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో లక్ష్య ఛేదనలో మహా నిపుణుడిగా పేరుగాంచిన విరాట్ కోహ్లీ మరోసారి చరిత్ర సృష్టించిన సందర్భం 2016 టీ20 ప్రపంచకప్. సెమీస్‌కు చేరుకోవాలంటే ఆసీస్‌ను తప్పక ఓడించాల్సిన మ్యాచ్. అది క్వార్టర్ ఫైనల్‌కు ఏమాత్రం తక్కువ కాదు. 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన భారత్‌కు కోహ్లీ (82* - 51 బంతుల్లో) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Details
అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ
మ్యాచ్ చివర్లో ఏడు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమైన పరిస్థితి. స్ట్రైక్‌లో ఎంఎస్ ధోని ఉన్నా, సింగిల్ తీసే అవకాశాన్ని కూడా వదిలేసి కోహ్లీనే ముగించాలన్న నమ్మకం వ్యక్తం చేశాడు. చివరికి బౌండరీతో విజయం ఖాయం చేసిన కోహ్లీ ఆనందంతో మైదానంలో నిలిచిపోయిన దృశ్యం ఇప్పటికీ గుర్తుండే క్షణం. అదేవిధంగా 2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై కూడా 82 పరుగులతో అజేయంగా నిలిచిన ఇన్నింగ్స్ అతడి ఛేజింగ్ సామర్థ్యానికి నిదర్శనం.
Details
ఇప్పుడు సంజు విండీస్‌పై నిలకడైన పోరాటం
ఈసారి అదే తరహా ఒత్తిడి పరిస్థితిలో నిలిచిన ఆటగాడు సంజు శాంసన్. ఓడితే ఇంటిముఖం పట్టాల్సిన మ్యాచ్. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి విండీస్‌ను 200లోపే నిలిపారు. చేజింగ్‌లో భారత్‌కు ప్రారంభం అంతగా కలిసిరాలేదు. అభిషేక్ శర్మ ఫామ్‌లో లేడు. వన్‌డౌన్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ నిలకడగా ఆడలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ త్వరగా ఔటయ్యాడు. తిలక్ వర్మ కొన్ని మెరుపులు మెరిపించగా, హర్దిక్ పాండ్యా దూకుడు కొద్దిసేపే కొనసాగింది.
Details
97 పరుగులతో రాణించిన సంజు
ఒక ఎండ్‌లో మాత్రం సంజు శాంసన్ (97* - 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) పాతుకుపోయి, చివరివరకు క్రీజ్‌లో నిలిచి జట్టును విజయానికి చేర్చాడు. చివరి బౌండరీతో మ్యాచ్‌ను ముగించిన తర్వాత చేసిన అతని విజయనాదం, యువరాజ్ సింగ్ 2011లో చేసిన సింహగర్జనను, కోహ్లీ 2016లో చూపిన ఆనందాన్ని అభిమానుల కళ్ల ముందుకు తీసుకొచ్చింది. ఇలా కీలక సమయంలో బాధ్యత తీసుకొని అజేయ ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించిన ఈ ముగ్గురు స్టార్లు - యువీ, కోహ్లీ, సంజు - భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ క్షణాలను అందించారు.