SA vs BAN : క్వింటన్ డి కాక్ సెంచరీల మోత.. సరికొత్త రికార్డు నమోదు
వన్డే వరల్డ్ కప్ 2023లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటాన్ డికాక్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇవాళ సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ముంబైలోని వాంఖెడేలో జరిగింది. ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటాన్ డికాక్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచులో 140 బంతుల్లో ( 15 ఫోర్లు, 7 సిక్సర్లు) 174 పరుగులు సాయంతో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో వన్డేల్లో తన 20వ సెంచరీని పూర్తి చేస్తున్నాడు. ఈ టోర్నీలో రెండు సెంచరీలకు పైగా సాధించిన మొట్టమొదటి సౌతాఫ్రికా బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. ఈ స్టార్ బ్యాటర్ దిల్లీ శ్రీలంకపై 100 పరుగులు, లక్నోపై ఆస్ట్రేలియా 109 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసి రికార్డు సృష్టించారు.
వన్డేల్లో 20 సెంచరీలను బాదిన క్వింటన్ డి కాక్
వన్డే క్రికెట్‌లో డి కాక్‌కి ఇది 20వ సెంచరీ. ఈ ఫార్మాట్‌లో 20 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన నాలుగో దక్షిణాఫ్రికా ఆటగాడిగా డికాక్ నిలిచాడు. ఈ విషయంలో ఆమ్లా (27), డివిలియర్స్ (25), గిబ్స్ (21) తర్వాత డి కాక్ ఉన్నాడు. 150వ వన్డే ఆడుతున్న డి కాక్ ఈ ఫార్మాట్‌లో 30 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. ఈ మ్యాచ్‌లో డి కాక్ వన్డే క్రికెట్‌లో 6,500 పరుగుల మార్క్‌ను అందుకోవడం విశేషం.దక్షిణాఫ్రికా తరఫున వన్డేల్లో 6,500 పైగా పరుగులు సాధించిన ఏడో బ్యాటర్‌గా డికాక్ రికార్డుకెక్కాడు.