Page Loader
Ravichandran Ashwin: ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆర్‌ అశ్విన్‌ 
ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆర్‌ అశ్విన్‌

Ravichandran Ashwin: ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆర్‌ అశ్విన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 27, 2024
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు ఆర్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో వికెట్ తీయడం ద్వారా అశ్విన్ ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. తొలి రోజు లంచ్ సమయానికి బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో సెషన్ 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. సెషన్ ప్రారంభంలోనే, అశ్విన్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో వికెట్ తీశాడు. దీంతో అనిల్ కుంబ్లే భారీ రికార్డును అశ్విన్ బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఆసియాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.