LOADING...
KKR vs RCB : రహానే సెన్సేషనల్ ఇన్నింగ్స్.. ఆర్‌సీబీ ముందు 175 పరుగుల టార్గెట్
రహానే సెన్సేషనల్ ఇన్నింగ్స్.. ఆర్‌సీబీ ముందు 175 పరుగుల టార్గెట్

KKR vs RCB : రహానే సెన్సేషనల్ ఇన్నింగ్స్.. ఆర్‌సీబీ ముందు 175 పరుగుల టార్గెట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2025
09:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. 18వ సీజన్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసి ఆలౌటైంది. సునీల్ నరైన్ (44), అజింక్య రహానే (56) కలిసి కోల్‌కతా ఇన్నింగ్స్‌ను మోస్తూ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. రహానే 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. రఘువంశీ (30) కూడా నిలకడగా ఆడాడు. తొలి ఓవర్‌లోనే క్వింటన్ డికాక్ (4) ఔటయ్యాడు.

Details

3 వికెట్లు పడగొట్టిన కృనాల్ పాండ్యా

రసిఖ్ సలామ్ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్‌ ఇచ్చి సునీల్ నరైన్ (44) ఔటయ్యాడు. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో రసిఖ్ సలామ్‌కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ అజింక్య రహానే (56) వెనుదిరిగాడు. వెంకటేశ్ అయ్యర్ (6) కూడా కృనాల్ పాండ్య బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. చివర్లో రింకు సింగ్ (12) ఆండ్రీ రస్సెల్ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కృనాల్ పాండ్య అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ 3 వికెట్లు తీయగా, జోష్ హాజెల్‌వుడ్ రెండు కీలక వికెట్లు తీశాడు. సుయాష్ శర్మ, రసిఖ్ దార్ సలాం, యశ్ దయాల్ తలో వికెట్‌ పడగొట్టారు.