Rashid khan: టీ20ల్లో అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు.
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్, పార్ల్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు.
ఈ విజయంతో అతడు తన టీ20 కెరీర్‌లో (అంతర్జాతీయ + లీగ్‌లు) కలిపి మొత్తం 633 వికెట్లు సాధించాడు.
ఇందులో అఫ్గానిస్థాన్ తరఫున 161 వికెట్లు పడగొట్టగా, మిగిలిన 472 వికెట్లు దేశవాళీ క్రికెట్‌తో పాటు వివిధ లీగ్‌ల్లో తీశాడు.
వివరాలు
భారత అభిమానులకు సుపరిచితుడైన రషీద్
అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
భారత దేశంలోనూ ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులకు మరింత సుపరిచితుడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అనేక సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించిన రషీద్, ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు.
ఇప్పుడు అత్యధిక టీ20 వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన రషీద్, 461 మ్యాచుల్లో 18.08 సగటుతో ఈ ఘనతను అందుకున్నాడు.
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 582 మ్యాచుల్లో 24.40 సగటుతో 631 వికెట్లు తీసిన రికార్డును అధిగమించాడు.