Loading...
Rohit Sharma: రోహిత్ రిటైర్మెంట్‌ వార్తల మధ్య రవిశాస్త్రి కామెంట్స్‌ వైరల్
రోహిత్ రిటైర్మెంట్‌ వార్తల మధ్య రవిశాస్త్రి కామెంట్స్‌ వైరల్

Rohit Sharma: రోహిత్ రిటైర్మెంట్‌ వార్తల మధ్య రవిశాస్త్రి కామెంట్స్‌ వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడటమే తన ప్రధాన లక్ష్యంగా పలుమార్లు చెప్పాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌ వేదికగా జరగనున్న మూడో వన్డే అతడి అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్‌ కావొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్.. ఇప్పుడు వన్డేలకూ గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తూ రోహిత్ తల్లిదండ్రులు లార్డ్స్‌కు చేరుకున్నారనే సమాచారం కూడా చక్కర్లు కొడుతోంది. గత రెండు వన్డేల్లో అతడు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో జట్టు మేనేజ్‌మెంట్ కూడా అతడితో చర్చలు జరిపిందనే కథనాలు వినిపిస్తున్నాయి.

వివరాలు

భావోద్వేగంగా కనిపించిన విరాట్

దీంతో మూడో వన్డే అనంతరం రోహిత్ రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశాలపై అభిమానుల్లో చర్చ మొదలైంది.

రెండో వన్డే సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

భారత ఇన్నింగ్స్ సమయంలో డ్రెస్సింగ్‌రూమ్‌లో రోహిత్ పక్కనే విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా కూర్చున్న దృశ్యాలు అందులో కనిపించాయి.

ముఖ్యంగా విరాట్ భావోద్వేగంగా కనిపించడం అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది. మరోవైపు మ్యాచ్ సందర్భంగా కామెంట్రీలో మాజీ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి.

రోహిత్‌ భారత క్రికెట్‌కు అందించిన సేవలను గుర్తుచేసిన ఆయన.. టీ20 ప్రపంచకప్‌ను దేశానికి అందించిన ఘనతతో పాటు, వన్డే ప్రపంచకప్‌ను కూడా దాదాపు గెలిపించిన నాయకుడిగా ప్రశంసించాడు.

వివరాలు

"చివరి మ్యాచ్ అయితే సెంచరీతో ముగిస్తాడు" - పార్థివ్ పటేల్

ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచిన రోహిత్.. 2019 ప్రపంచకప్‌లో యూకే గడ్డపై ఆ ఘనత సాధించాడని రవిశాస్త్రి గుర్తు చేశాడు.

ఈ వ్యాఖ్యలతో లార్డ్స్‌లో రోహిత్ మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు.

భారత మాజీ వికెట్‌కీపర్ పార్థివ్ పటేల్ కూడా రోహిత్‌పై పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు.

ఒకవేళ లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డేనే రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్ అయితే, అతడు తప్పకుండా సెంచరీతోనే తన ప్రయాణాన్ని ముగిస్తాడని అభిప్రాయపడ్డాడు.

గతంలో కూడా కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైన తర్వాత రోహిత్ బలంగా తిరిగి వచ్చి భారీ ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని పార్థివ్ గుర్తుచేశాడు.

ADVERTISEMENT

వివరాలు

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఒకరితో మరొకరిని పోల్చడం సరికాదు

లార్డ్స్‌లో కూడా అలాంటి ప్రదర్శనే చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఒకరితో మరొకరిని పోల్చడం సరికాదని పార్థివ్ అభిప్రాయపడ్డాడు.

ఇద్దరి ఆటశైలి పూర్తిగా భిన్నమని, రోహిత్ ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్లు చేయకపోయినా, ఒకసారి కుదిరితే మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే స్థాయి ఆటగాడని కొనియాడాడు.

ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో కూడా అతడు మంచి ఆరంభం చేసినప్పటికీ దాన్ని పెద్ద ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడని, మూడో వన్డేలో మాత్రం విమర్శకుల నోటికి తాళం వేస్తాడనే నమ్మకం తనకు ఉందని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరలవుతున్న వీడియో

ADVERTISEMENT