LOADING...
IPL 2026: చెలరేగిన ఆర్సీబీ.. లక్నోపై విక్టరీ
చెలరేగిన ఆర్సీబీ.. లక్నోపై విక్టరీ

IPL 2026: చెలరేగిన ఆర్సీబీ.. లక్నోపై విక్టరీ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 15, 2026
11:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో మరోసారి ఆధిపత్యాన్ని చాటింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ సమిష్టిగా రాణించి అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఫలితంగా 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. లక్నో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్‌సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం 7 పరుగులకే పెవిలియన్‌కు చేరి జట్టుకు నిరాశ కలిగించాడు. అయితే క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తన స్థిరమైన ఫామ్‌ను కొనసాగిస్తూ లక్నో బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు.

వివరాలు

జితేశ్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్..

మధ్య ఓవర్లలో కెప్టెన్ రజత్ పాటీదార్ వేగంగా ఆడి మ్యాచ్‌ను పూర్తిగా ఆర్‌సీబీ వైపు తిప్పేశాడు. కేవలం 13 బంతుల్లో 27 పరుగులు చేసిన ఆయన, జట్టుకు అవసరమైన వేగాన్ని అందించాడు. అతనికి తోడుగా జితేశ్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. కేవలం 9 బంతుల్లో 23 పరుగులు చేసి వరుస ఫోర్లు, సిక్సర్లతో చిన్నస్వామి స్టేడియంలో ఉత్సాహాన్ని నింపాడు. ఈ దూకుడైన ఇన్నింగ్స్‌లతో లక్ష్యం మరింత సులభమైంది.

వివరాలు

తడబడిన లక్నో..

చివర్లో టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ సమయోచితంగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఆర్‌సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ విజయంతో జట్టు పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. లక్నో బౌలర్లలో 'ప్రిన్స్' అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసి ఆర్‌సీబీని కట్టడి చేయడానికి ప్రయత్నించాడు. అలాగే ఆవేశ్ ఖాన్ కూడా 2 వికెట్లు పడగొట్టి తన వంతు పాత్ర పోషించాడు. అయితే తక్కువ లక్ష్యాన్ని ఎదుర్కొన్న ఆర్‌సీబీ బ్యాటర్ల దూకుడుకు లక్నో బౌలింగ్ విభాగం నిలవలేకపోయింది.

Advertisement