LOADING...
RCB Playing XI: గుజరాత్‌కు చెక్ పెట్టేందుకు ఆర్‌సీబీ మాస్టర్ ప్లాన్.. ఫైనల్‌కు ముందు కీలక నిర్ణయం!
గుజరాత్‌కు చెక్ పెట్టేందుకు ఆర్‌సీబీ మాస్టర్ ప్లాన్.. ఫైనల్‌కు ముందు కీలక నిర్ణయం!

RCB Playing XI: గుజరాత్‌కు చెక్ పెట్టేందుకు ఆర్‌సీబీ మాస్టర్ ప్లాన్.. ఫైనల్‌కు ముందు కీలక నిర్ణయం!

వ్రాసిన వారు Moogati Shabari
May 31, 2026
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో మరోసారి ఛాంపియన్‌గా నిలవాలనే లక్ష్యంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ఫైనల్‌కు సిద్ధమవుతోంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కొనేందుకు ఆర్‌సీబీ సన్నద్ధమైంది. రజత్ పాటిదార్ నాయకత్వంలో ఈ సీజన్ మొత్తం అద్భుత ప్రదర్శన చేసిన బెంగళూరు జట్టు, ఆటగాళ్ల సమిష్టి కృషితో ఫైనల్ వరకు విజయవంతంగా చేరుకుంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ ప్లేయింగ్ ఎలెవన్‌పై చర్చలు జరుగుతున్నప్పటికీ, విజయవంతంగా కొనసాగుతున్న కాంబినేషన్‌లో పెద్ద మార్పులు చేసే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. వరుసగా రెండో ఐపీఎల్ ట్రోఫీ సాధించాలనే లక్ష్యంతో జట్టు తమ విజయ సూత్రాన్ని కొనసాగించే అవకాశమే ఎక్కువగా ఉంది.

వివరాలు

మంచి ఫామ్‌లో కొనసాగుతున్న వెంకటేష్ అయ్యర్..

గాయం కారణంగా చికిత్స కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లిన స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇటీవలే జట్టుతో మళ్లీ కలిశాడు. అయితే ఆయన పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేకపోవడంతో ఫైనల్‌లో ఆడే అవకాశాలు సందేహాస్పదంగా ఉన్నాయి. దీంతో వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీలు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 59 సగటుతో 177 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా 19 బంతుల్లో 44 పరుగులు, మరో మ్యాచ్‌లో 7 బంతుల్లో 19 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతని దూకుడు ప్రదర్శన కారణంగా జాకబ్ బెథెల్‌కు అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తోంది.

వివరాలు

నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి..

ఇక విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 600 పరుగులు చేసి అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అయ్యర్‌తో కలిసి కోహ్లీ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించే సామర్థ్యం కలిగి ఉన్నాడు. బ్యాటింగ్ విభాగంలో మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్, నాలుగో స్థానంలో కెప్టెన్ రజత్ పాటిదార్, ఐదో స్థానంలో కృణాల్ పాండ్యా కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు సాధించే బాధ్యతలను టిమ్ డేవిడ్ భుజాన వేసుకోనున్నాడు. అహ్మదాబాద్ పిచ్ ఈ ఏడాది పేస్ బౌలర్లకు అనుకూలంగా మారిన నేపథ్యంలో ఆర్‌సీబీ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు

పేస్ దళానికి భువనేశ్వర్ నాయకత్వం..

పేస్ దళానికి అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహించనున్నాడు. క్వాలిఫయర్-1లో గుజరాత్‌పై మూడు వికెట్లు సాధించిన జాకబ్ డఫీకి కూడా తుది జట్టులో స్థానం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వీరితో పాటు జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్ డార్ పేస్ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్ సరైనపిచ్‌పై జరిగితే పరిస్థితులు కొంత భిన్నంగా ఉండొచ్చు. అలాంటి సందర్భంలో రోమారియో షెపర్డ్‌ను జట్టులోకి తీసుకురావాలని కెప్టెన్ పాటిదార్ ఆలోచించే అవకాశం ఉంది. స్పిన్‌కు పెద్దగా అనుకూలత లేని ఈ పిచ్‌పై ప్రధాన స్పిన్నర్‌గా కృణాల్ పాండ్యానే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ పరిస్థితులను బట్టి సుయాష్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వినియోగించే అవకాశం కూడా జట్టు వద్ద ఉంది.

Advertisement