LOADING...
WPL 2026: యూపీ వారియర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
యూపీ వారియర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం

WPL 2026: యూపీ వారియర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2026
10:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ 2026లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొట్టింది. యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం నమోదు చేసింది. 144 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ, కేవలం 12.1 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంలో ఓపెనర్లు కీలక పాత్ర పోషించారు. హారిస్ అద్భుతంగా 85 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపించగా, కెప్టెన్ స్మృతి మంధాన 47 పరుగులతో ఆమెకు చక్కటి సహకారం అందించారు. వారి ధాటికి యూపీ వారియర్స్ బౌలర్లు పూర్తిగా వెనకడుగు వేశారు.

Details

వరుసగా రెండో విజయం

ఈ గెలుపుతో ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించడం విశేషం.

Advertisement