LOADING...
Josh Hazlewood : ఆర్సీబీలోకి ఆ స్ట్రాంగ్ ప్లేయర్ రీ-ఎంట్రీ.. రాజస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్
ఆర్సీబీలోకి ఆ స్ట్రాంగ్ ప్లేయర్ రీ-ఎంట్రీ.. రాజస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్

Josh Hazlewood : ఆర్సీబీలోకి ఆ స్ట్రాంగ్ ప్లేయర్ రీ-ఎంట్రీ.. రాజస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 10, 2026
10:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026లో 16వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మళ్లీ బరిలోకి దిగుతోంది. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం ఉన్నప్పటికీ మ్యాచ్ పూర్తి 20 ఓవర్ల పాటు జరగనుందని అధికారులు తెలిపారు. రాజస్థాన్ జట్టులో ఒక మార్పు చేస్తూ తుషార్ దేశ్‌పాండే స్థానంలో బ్రిజేష్ శర్మను తీసుకున్నారు. ఆర్సీబీ జట్టులో కీలక మార్పుగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హాజల్‌వుడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయంతో రెండు మ్యాచ్‌లు మిస్ అయిన తర్వాత అతను మళ్లీ ప్లేయింగ్ XIలో చోటు సంపాదించాడు. అతని స్థానంలో జేకబ్ డఫీని తప్పించారు.

వివరాలు

అద్భుత ప్రదర్శన చూపేందుకు రెడీ

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ మాట్లాడుతూ, హాజిల్‌వుడ్ అనుభవం జట్టుకు ఎంతో బలాన్నిస్తుందని చెప్పారు. రాజస్థాన్ కెప్టెన్ రియాంగ్ పరాగ్ మాత్రం పిచ్ డ్రైగా కనిపించినా ఇటీవల వర్షాల ప్రభావం ఉండొచ్చని తెలిపారు. హాజిల్‌వుడ్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 39 ఇన్నింగ్స్‌లలో 57 వికెట్లు తీసి తన స్థిరత్వాన్ని నిరూపించాడు. గత సీజన్‌లో ఆర్సీబీకి తొలి టైటిల్ అందించడంలో అతని పాత్ర కీలకంగా నిలిచింది. ఆ సీజన్‌లో 12 మ్యాచ్‌లలో 22 వికెట్లు తీసి మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ వేశాడు. అతని స్థానంలో ఆడిన జేకబ్ డఫీ కూడా రెండు మ్యాచ్‌లలో 5 వికెట్లు తీసి, ఓ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.

వివరాలు 

జట్ల వివరాలివే..

ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాయి. RCB తరఫున విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, హాజిల్‌వుడ్ బరిలోకి దిగుతున్నారు. రాజస్థాన్ తరఫున యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మేయర్, డోనోవన్ ఫెర్రెరా, జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ ఆడుతున్నారు. ఇంపాక్ట్ సబ్‌గా వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ తరఫున బరిలోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్సీబీ తరఫున సుయశ్ శర్మ, జేకబ్ బెతెల్, కనిష్క్ చౌహాన్, వెంకటేశ్ అయ్యర్ ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఉన్నారు.

Advertisement