LOADING...
CSK Vs RCB: 43 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం.. చెన్నైకి వరుసగా మూడో ఓటమి
43 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం.. చెన్నైకి వరుసగా మూడో ఓటమి

CSK Vs RCB: 43 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం.. చెన్నైకి వరుసగా మూడో ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2026
11:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో ఆర్సీబీ జట్టు 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు సాధించింది. ఆ జట్టు బ్యాటర్లలో టిమ్ డేవిడ్ 70, దేవదత్ పడిక్కల్ 50, రజత్ పాటిదార్ 48, ఫిల్ సాల్ట్ 46, విరాట్ కోహ్లీ 28 పరుగులతో అద్భుత ప్రదర్శన కనబరచి భారీ స్కోరు సాధించారు. సీఎస్కే 251 పరుగుల లక్ష్య ఛేదనలో 19.4ఓవర్లలోనే 207 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మొదటి బ్యాటింగ్ చేసిన సీఎస్కే ఆది నుంచి తడబడింది

వివరాలు

30 పరుగులకే 3 వికెట్లు

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7) పరుగులకే మొదటి ఓవర్‌లో జాకబ్ డఫీ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. రెండో ఓవర్‌లో ఆయూష్ మాత్రే (1) రన్ చేసి భువనేశ్వర్ కుమార్ చేతిలో ఔట్ అయ్యారు. మూడో ఓవర్‌లో స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ (9) పరుగులకే డఫీ చేతిలో ఔట్ కావడంతో జట్టు 30 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 50 మెరుపు హాఫ్ సెంచరీతో సీఎస్కేకే జట్టుని నడిపించడానికి ప్రయత్నించాడు. అయితే కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో స్టంప్ ఔట్ అయి పెవిలియానికి చేరాడు.

వివరాలు

సీఎస్కే బ్యాటర్లు విఫలం

తరువాత ఇంపాక్ట్ ప్లేయర్ కార్తిక్ శర్మ (6)పరుగులు చేసి కృనాల్ బౌలింగ్‌లో అభినందన్ సింగ్ చేతిలో క్యాచ్ ఇవ్వడంతో మైదానం వదిలారు. దీంతో 84 పరుగులకే సీఎస్కే 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత క్రీసులోకి వచ్చిన శివమ్ దూబే మొదటి బంతిని స్టాండ్స్‌లోకి కొట్టి మంచి ప్రారంభం చూపినప్పటికీ, కేవలం 18పరుగులు చేసి అభినందన్ సింగ్ బౌలింగ్‌లో జితేష్ శర్మ చేతిలో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టిన్ మధ్య 57పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, అది జట్టుకు చివరి కాసేపు ఓ ఊరట ఇచ్చేలా నిలిచింది. చివర్లో ఆర్సీబీ జట్టు బౌలర్లు రాణించడంతో ఆ జట్టు 43పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చెన్నైపై ఆర్సీబీ గెలుపు

Advertisement