Rohit Sharma: ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై తాజా అప్‌డేట్..!
ఈ వార్తాకథనం ఏంటి
ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఊరటనిచ్చే వార్త వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ముంబయి జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ గాయంతో మైదానం విడిచిపెట్టాల్సి వచ్చింది. గాయం కారణంగా అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 241 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ముంబయి జట్టు 222 పరుగులకే పరిమితమైంది. ఆ సమయానికి రోహిత్ 13 బంతుల్లో 19 పరుగులు నమోదు చేశాడు. ఈ ఘటనతో అతని గాయంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే, తాజాగా వచ్చిన మెడికల్ రిపోర్ట్ ప్రకారం పెద్దగా సమస్య ఏమీ లేదని వెల్లడైంది.
వివరాలు
కండరాలు పట్టేయడంతో..
కండరాలు పట్టేయడం వల్లనే అతడు బయటకు వెళ్లాల్సి వచ్చిందని తెలిసింది. స్కానింగ్ చేసిన తర్వాత కూడా ఎలాంటి చీలికలు లేవని నిర్ధారణ అయింది. దీంతో ముంబయి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ, గురువారం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు ఆడతాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. గాయం తీవ్రంగా లేకపోవడంతో ఎక్కువ మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితి లేదని సమాచారం. ఈరోజు సాయంత్రానికి అతని ఫిట్‌నెస్‌పై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
వివరాలు
ఐపీఎల్‌లో 6 వేల పరుగులు..
కండరాల సమస్య కారణంగా రోహిత్ మైదానం విడిచినా, స్కానింగ్‌లో ఎలాంటి గాయం కనిపించకపోవడం వల్ల అతడు దీర్ఘకాలం జట్టుకు దూరమవుతాడనే అనుమానాలు తగ్గిపోయాయి. అయితే పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో అతడిని ఆడించాలా వద్దా అనే నిర్ణయం జట్టు మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌గా రోహిత్ సేవలు జట్టుకు ఎంతో కీలకం. అవసరమైతే అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా వినియోగించే అవకాశమూ ఉంది. ఐఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరఫున 6000 పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా రోహిత్ ప్రత్యేక గుర్తింపు పొందాడు.
వివరాలు
ప్రతి మ్యాచ్ కీలకమే..
ఈ సీజన్‌లో ముంబయి జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక విజయం మాత్రమే సాధించింది. ప్లేఆఫ్స్‌లో స్థానం సంపాదించాలంటే ఇక ముందు ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడం తప్పనిసరి. బ్యాటింగ్ విభాగంలో జట్టు ప్రదర్శన కొంతవరకు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం జట్టు నిరాశపరుస్తోంది. ప్రముఖ పేసర్లు బుమ్రా, బౌల్ట్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ప్రత్యర్థి జట్ల పరుగులను నియంత్రించడంలో వారు విఫలమవుతున్నారు.