Page Loader
Rinku Singh Engagement: నేడు రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం 
నేడు రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం

Rinku Singh Engagement: నేడు రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెటర్ రింకూ సింగ్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేసేందుకు సిద్ధమయ్యాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను వివాహం చేసుకోనున్న రింకూ, ఈరోజు (జూన్ 8) ఆమెతో నిశ్చితార్థం జరుపుకోబోతున్నాడు. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక లక్నోలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఇద్దరి నిశ్చితార్థం కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది.

Details

300 మంది అతిథులు హాజరయ్యే అవకాశం

ఈ వేడుకకు సుమారు 300 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. రింకూ సింగ్‌-ప్రియా సరోజ్‌ పెళ్లి ఈ ఏడాది నవంబర్ 18న వారణాసిలోని హోటల్ 'తాజ్‌'లో వైభవంగా జరగనుంది. రింకూ సింగ్ చిన్ననాటి నుంచి ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితుల్లో ఎదిగాడు. కానీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తూ టీమిండియా వరకు ఎదిగాడు. ఇప్పుడు ఓ ఎంపీ అయిన ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.