
రింకూసింగ్ ఫినిషింగ్ టచ్; ఉత్కంఠపోరులో పంజాబ్ కింగ్స్‌పై కేకేఆర్ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు అదరగొట్టారు.
రస్సెల్, రింకూసింగ్ విజృంభణతో పంజాబ్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్‌తో 5వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కేకేఆర్ విజయంలో నితీశ్ రాణా, రస్సెల్, రింకూసింగ్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 19వ ఓవర్‌లో రస్సెల్ కొట్టిన మూడు సిక్సులతో మ్యాచ్ ఒక్కసారిగా కేకేఆర్ వేపు మళ్లింది.
ఆఖరి ఓవర్లో ఒక బాల్‌లో రెండు పరుగులు చేయాల్సి ఉండగా రింకు తనదైన శైలిలో ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 179 పరుగులు చేయగా, కేకేఆర్ ముందు 180పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో కేకేఆర్ బ్యాటర్లు 20ఓవర్లలో 182పరుగులు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
5వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం
Match 53. Kolkata Knight Riders Won by 5 Wicket(s) https://t.co/uA3p07r8Ir #TATAIPL #KKRvPBKS #IPL2023
— IndianPremierLeague (@IPL) May 8, 2023