Page Loader
BIG BREAKING: రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు
తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్

BIG BREAKING: రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2022
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడ్డాడు. ఆతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మంటలు చేలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పంత్ తలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన రూర్కిలోని నర్సన్ సరిహద్దు సమీపంలోని ఉన్న హమ్మద్ పూర్ట్ ఝల్ రహదారిపై జరిగింది. వెంటనే రిషబ్ ను రిషికేష్ లోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అనంతరం అక్కడి నుంచి ప్లాస్టిక్ సర్జరీ కోసం ఢిల్లీ ఆస్ప్రతికి పంపారు.

రిషబ్ పంత్_

రిషబ్ పంత్ తలకు తీవ్ర గాయాలు

రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ నుండి ఢిల్లీకి కారులో వెళ్తుతుండగా ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. రిషబ్ పంత్ తలకు, వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం జరిగిన ఘటనను తెలుసుకున్న భారత్ అభిమానులు రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.