Page Loader
Sana Ganguly: రోడ్డు ప్రమాదం.. గంగూలీ కుమార్తె కారును ఢీకొట్టిన బస్సు
రోడ్డు ప్రమాదం.. గంగూలీ కుమార్తె కారును ఢీకొట్టిన బస్సు

Sana Ganguly: రోడ్డు ప్రమాదం.. గంగూలీ కుమార్తె కారును ఢీకొట్టిన బస్సు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ క్రికెటర్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీకి త్రుటీలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. శుక్రవారం రాత్రి కోల్‌కతాలోని డైమండ్‌ హార్బర్‌ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. కోల్‌కతా నుంచి రాయ్‌చక్‌ వెళ్తున్న బస్సు బెహలా చౌరస్తా వద్ద సనా కారును ఢీకొట్టింది. ఆ సమయంలో కారు డ్రైవర్‌ నడుపుతుండగా, సనా పక్క సీట్లో కూర్చొని ఉన్నారు. ప్రమాదం తర్వాత బస్సు వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో, కారు డ్రైవర్‌ దానిని వెంబడించి కొంతదూరం వెళ్లాక ఆపించాడు.

Details

బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రమాదం గురించి గంగూలీ కుమార్తె వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సనా గంగూలీ ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సనాకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై సనా నుంచి ఎలాంటి అధికారిక ఫిర్యాదు రాలేదని పోలీసులు పేర్కొన్నారు.