LOADING...
Robin Singh: ముంబై ఇండియన్స్‌‌కు దెబ్బ మీద దెబ్బ.. 14 ఏళ్ల బంధానికి రాబిన్ సింగ్ గుడ్ బై
ముంబై ఇండియన్స్‌‌కు దెబ్బ మీద దెబ్బ.. 14 ఏళ్ల బంధానికి రాబిన్ సింగ్ గుడ్ బై

Robin Singh: ముంబై ఇండియన్స్‌‌కు దెబ్బ మీద దెబ్బ.. 14 ఏళ్ల బంధానికి రాబిన్ సింగ్ గుడ్ బై

వ్రాసిన వారు Moogati Shabari
May 15, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

రాబిన్ సింగ్ ముంబయి ఇండియన్స్‌తో కొనసాగిన తన దీర్ఘకాల అనుబంధానికి ముగింపు పలికాడు. భారత మాజీ ఆల్‌రౌండర్‌గా, అనుభవజ్ఞుడైన కోచ్‌గా పేరుగాంచిన ఆయన.. 2010లో ప్రారంభమైన 14 సంవత్సరాల ప్రయాణం ఇక ముగిసిందని అధికారికంగా వెల్లడించాడు. ఐపీఎల్‌లోని ముంబయి ఇండియన్స్ జట్టుతో పాటు, ఐఎల్‌టీ20 టోర్నీలోని ఎంఐ ఎమిరేట్స్ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ విషయాన్ని 'ఎక్స్' వేదికగా తెలియజేసిన రాబిన్ సింగ్, "ముంబై ఇండియన్స్ సంస్థతో నా ప్రయాణం అధికారికంగా ముగిసిందని తెలియజేస్తున్నాను. 2022 తర్వాత ఐపీఎల్ జట్టులో నేను భాగస్వామి కాకపోయినా, ఈ ఏడాదితో ఎమిరేట్స్ లీగ్ జట్టుతో నా అనుబంధం కూడా పూర్తిగా ముగిసింది" అని పేర్కొన్నాడు.

వివరాలు

యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు..

ఈ సందర్భంగా ఫ్రాంచైజీ యాజమాన్యానికి, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. "2010 నుంచి సాగిన ఈ విశేషమైన ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ఎంఐ కుటుంబ సభ్యులందరికీ, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఈ ఫ్రాంచైజీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను" అని తన సందేశంలో వెల్లడించాడు.

వివరాలు

ముగిసిన ప్రత్యేక అధ్యాయం..

2010 నుంచి ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి పనిచేసిన రాబిన్ సింగ్, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆయన మార్గదర్శకత్వంలో ముంబై ఇండియన్స్ ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 కప్పులు గెలుచుకుంది. అదేవిధంగా, 2023లో ప్రారంభమైన తొలి ఐఎల్‌టీ20 సీజన్‌లో ఎంఐ ఎమిరేట్స్‌కు జనరల్ మేనేజర్‌గా సేవలందించిన ఆయన, 2024లో అదే జట్టుకు హెడ్ కోచ్ బాధ్యతలు కూడా నిర్వహించాడు. ఆయన వైదొలగడంతో ముంబై ఇండియన్స్ కోచింగ్ విభాగంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం ముగిసినట్టైంది.

Advertisement