Womens T20 World Cup 2023లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు బోణీ చేసింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. పాకిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఇండియా గెలిచింది. రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో రాణించగా షెఫాలీ వర్మ, రిచా ఘోస్ పర్వాలేదనిపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్ (55 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు), అయేషా నసీమ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) లతో అదుకున్నారు. అనంతరం భారత్ 19 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
భారత్‌కు గెలుపునందించిన రోడ్రిగ్స్
93/3 వికెట్లు కోల్పోయిన భారత్ ఒకానొక దశలో గెలుపు కష్టమైంది. కానీ రిచా, రోడ్రిగ్స్ అద్భుతంగా రాణించారు. భారీ షాట్లను అలవోకగా ఆడగలిగే రిచా.. ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టడంతో భారత్‌కు గెలుపు దాదాపు ఖాయమైంది. రోడ్రిగ్స్ 38 బంతుల్లో (8ఫోర్ల) 53 పరుగులు చేసింది. దీంతో తన 10వ అర్ధ సెంచరీని నమోదు చేసింది. అనంతరం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ' జెమీమా రోడ్రిగ్స్' ఎంపికైంది. 2018లో అరంగేట్రం చేసిన రోడ్రిగ్స్ టీ20ల్లో 1600 పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచింది. 76 మ్యాచ్‌ల్లో 1,628 పరుగులు చేసింది. భారత్ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 15న వెస్టిండీస్‌తో ఆడుతుంది.