తదుపరి వార్తా కథనం

Rohit Sharama: ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. వార్మప్ మ్యాచ్ ఆడే అవకాశం!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 24, 2024
02:56 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఎట్టకేలకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో కాలు మోపాడు.
ఇటీవలే అతని భార్య రితికా మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో లేని విషయం తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. తొలి టెస్టు మూడో రోజు ఆట జరుగుతున్న సమయంలోనే రోహిత్ పెర్త్ చేరుకోవడం ఆసక్తికరంగా మారింది.
దీంతో డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో రోహిత్ పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.
Details
రెండో టెస్టులో ఆడే అవకాశం
అంతకుముందు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు కాన్‌బెర్రా వేదికగా ప్రైమ్ మినిస్టర్స్ XI జట్టుతో భారత్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
ఈ రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో రోహిత్ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తద్వారా ఆసీస్ పిచ్‌లపై అవగాహన పెంచుకొనే అవకాశం ఉండనుంది.