
Vaibhav Suryavanshi: మొన్న 35 బంతుల్లో సెంచరీ.. నేడు ముంబై ఇండియన్స్‌తో వైభవ్ సూర్యవంశీ డకౌట్
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ రాయల్స్ జట్టు యువ స్టార్ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ మైదానంలోకి అడుగుపెట్టగానే, అభిమానులు అతడి గత ప్రదర్శనను గుర్తు చేసుకున్నారు.
గుజరాత్ టైటాన్స్‌పై మునుపటి ప్రదర్శనను మళ్లీ చూపిస్తాడని అంతా ఆశించారు.
ముంబై బౌలర్లపై సూర్యవంశీ విరుచుకుపడతాడని ఊహించారు.కానీ వాస్తవం మాత్రం భిన్నంగా కనిపించింది.
ఈసారి అతను తన ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కి చేరాడు.రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా జరిగింది.
ఇందులో రాజస్థాన్ జట్టు 100 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. గత మ్యాచ్‌లో సూర్యవంశీ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
ఆ మ్యాచ్‌లో సూర్యవంశీ,యశస్వి జైస్వాల్‌తో కలిసి 166 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నిర్మించాడు.
వివరాలు
సిక్స్ కొట్టేందుకు యత్నం.. బంతి నేరుగా విల్ జాక్స్ చేతుల్లోకి..
ఆ జోడి కేవలం 15.5 ఓవర్లలోనే 210 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
టోర్నీ చరిత్రలో 200కు పైగా లక్ష్యాన్ని అత్యంత వేగంగా చేధించిన ఘనతను రాజస్థాన్ జట్టు నమోదు చేసింది.
అయితే తాజా మ్యాచ్‌లో ముంబై బౌలర్లు, ముఖ్యంగా యువ ఆటగాడి కోసం ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగారు.
ఈ ప్రణాళికను అమలు చేసిన మొదటి ఆటగాడు దీపక్ చాహర్.
అతని బౌలింగ్‌లో సూర్యవంశీ పెద్ద షాట్ కోసం ప్రయత్నించాడు. సిక్స్ కొట్టేందుకు యత్నించిన బంతి, షాట్ మిస్సయ్యింది. ఫలితంగా బంతి నేరుగా విల్ జాక్స్ చేతుల్లోకి వెళ్లింది.
తాజా సెంచరీ ఇన్నింగ్స్ తర్వాత ఇలా గోల్డెన్ డక్‌గా ఔట్ కావడం రాజస్థాన్ అభిమానులకు గట్టి షాక్‌ను కలిగించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైభవ్ సూర్యవంశీ డకౌట్
https://t.co/uPnmCab1i5#VaibhavSuryavanshi #RRvsMI #IPL2025
— venkata chari thoudoju (@ThoudojuChari) May 2, 2025