Loading...
PV Sindhu: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌.. ఇప్పుడు హైలో ఓపెన్‌పై సింధు గురి!
ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌.. ఇప్పుడు హైలో ఓపెన్‌పై సింధు గురి!

PV Sindhu: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌.. ఇప్పుడు హైలో ఓపెన్‌పై సింధు గురి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2026
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్‌ షట్లర్‌ పివి.సింధు వెంటనే మరో టోర్నీకి సిద్ధమైంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న హైలో ఓపెన్‌లో ఆమె బరిలోకి దిగనుంది. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేతగా నిలిచిన సింధు.. ఈసారి జర్మనీలో సత్తాచాటాలని పట్టుదలతో ఉంది. ఆదివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి ఆన్‌ సె యాంగ్‌ను సింధు ఓడించలేకపోయింది. దీంతో ఆమెకు వరుసగా 11వసారి ఓటమి ఎదురైంది. అయితే, మంచి ఫామ్‌లో ఉన్న సింధు.. హైలో ఓపెన్‌లో టైటిల్‌ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగనుంది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో తుర్కియేకు చెందిన నెస్లిహా అరిన్‌తో ఆమె తలపడనుంది.

వివరాలు

టైటిల్ ను సొంతం చేసుకోవడమే లక్ష్యం

మహిళల సింగిల్స్‌లోనే భారత క్రీడాకారిణులు దేవిక సిహాగ్‌, అస్మిత చాలిహా, ఉన్నతి హుడా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

దేవిక సిహాగ్‌ థాయ్‌లాండ్‌కు చెందిన చౌచువాంగ్‌తో పోటీ పడనుండగా.. అస్మిత చాలిహా బల్గేరియాకు చెందిన నాల్బంటోవాను ఎదుర్కోనుంది.

మరోవైపు చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి తెరెజా స్వాబికోవాతో ఉన్నతి హుడా తలపడనుంది.

2019లో హైలో ఓపెన్‌ విజేతగా నిలిచిన భారత షట్లర్‌ లక్ష్య సేన్‌.. మరోసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

వివరాలు

లక్ష్య సేన్‌ గురి కూడా హైలో ఓపెన్‌ టైటిల్‌పైనే!

పారిస్‌ టోర్నీలో గాయం కారణంగా ప్రత్యర్థికి వాకోవర్‌ ఇచ్చిన అతడు.. తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు.

ఇప్పుడు మళ్లీ తన పూర్వపు ఫామ్‌ను అందుకోవాలని ఉత్సాహంగా ఉన్నాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఫిన్లాండ్‌కు చెందిన జొయాకిమ్‌ ఓల్డార్ఫ్‌తో లక్ష్య సేన్‌ తలపడనున్నాడు.

ఇదే విభాగంలో యువ భారత ఆటగాడు ఆయుష్‌ శెట్టి.. తైవాన్‌కు చెందిన లి యాంగ్‌తో పోటీ పడనున్నాడు. తరుణ్‌ మన్నెపల్లి ఫ్రాన్స్‌ ఆటగాడు తోమా జూనియర్‌ పొపొవ్‌ను ఎదుర్కోనున్నాడు.

హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఫ్రాన్స్‌కే చెందిన అలెక్స్‌ లానియర్‌తో తలపడనుండగా.. కిరణ్‌ జార్జ్‌ మలేసియాకు చెందిన జున్‌ వెయ్‌తో పోటీ పడనున్నాడు.

హైలో ఓపెన్‌లో భారత షట్లర్లు తమ సత్తా చాటి టైటిళ్లు సాధిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT