భారత్‌తో టెస్టు సిరీస్ ఓటమి.. బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ రాజీనామా
బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ పదవికి రస్సెల్ డొమింగో రాజీనామా చేశాడు. భారత్‌తో బంగ్లాదేశ్ టెస్టు సీరిస్‌ను 2-0 తేడాతో ఓడిపోయింది. రెండు రోజుల తర్వాత రస్సెల్ డొమింగ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. టెస్ట్ సిరీస్ ఓటమిని బంగ్లా క్రికెటర్లు జీర్ణించుకోలేకపోయారు. దీనిపై బంగ్లా ఆటగాడు యూనిస్ స్పందించాడు. 'జట్టుపై ప్రభావం చూపే కోచ్ కావాలి. మీరు త్వరలో కొన్ని మార్పులను చూస్తారు. మేము పోటీతత్వ జట్టుగా మారాలని అనుకుంటున్నాము. మేము భారత్‌ను ఓడించడానికి దగ్గరలో ఉన్నాము. ప్రస్తుతం ఈ మైదానంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను ఓడించాము' అని పేర్కొన్నారు. మ్యాచ్ తర్వాత క్రిస్మస్ విరామం కోసం డొమింగో దక్షిణాఫ్రికాలోని తన ఇంటికి బయలుదేరాడు.
డొమింగ్ నేతృత్వంలో సాధించిన అరుదైన ఘనతలు
ఒకప్పుడు పనికూనగా పేరున్న బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు ఫామ్ ఉన్న జట్లను ఓడిస్తూ.. సంచలన రికార్డులను నమోదు చేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ కప్ తర్వాత స్టీవ్ రోడ్స్‌ను BCB తొలగించిన కొన్ని నెలల తర్వాత.. సెప్టెంబర్ 2019లో డొమింగో ప్రధాన కోచ్‌గా చేరాడు. డోమింగ్ ఆధ్వర్యంలో, బంగ్లాదేశ్ స్వదేశంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై T20I సిరీస్‌ను సాధించి సత్తా చాటింది. న్యూజిలాండ్ మొదటి టెస్టును, దక్షిణాఫ్రికా, ఇండియా వన్డే సిరీస్ ను బంగ్లాదేశ్ గెలుచుకొని రికార్డు సృష్టించింది. ఢాకాలో BCB అధ్యక్షుడు నజ్ముల్ హసన్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ కొత్త సంవత్సరంలో "మరింత మంది కోచ్‌లను సెటప్‌లోకి తీసుకురావాలని చూస్తోందన్నారు.