తదుపరి వార్తా కథనం

RR vs KKR: సిక్సర్లతో రెచ్చిపోయిన రస్సెల్.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 04, 2025
05:26 pm
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కత్తా నైట్ రైడర్స్ (KKR) రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్, 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.
డేంజర్ బ్యాటర్ ఆండ్రూ రస్సెల్ 25 బంతుల్లో 57 పరుగులు (4 ఫోర్లు, 6 సిక్సులు) చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
రస్సెల్ దూకుడైన బ్యాటింగ్‌తో, కేకేఆర్ భారీ స్కోరును చేయగలిగింది.
Details
చివర్లో రింకూ సింగ్ మెరుపులు
ఓపెనర్లు రెహ్మానుల్లా గుర్బాజ్ 35 (4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ అజింక్యా రహానే 30 (1 ఫోర్, 2 సిక్సులు), రఘువంశీ 44 (5 ఫోర్లు) రాణించడంతో, కేకేఆర్ టోటల్ స్కోర్ 206కి చేరింది.
చివర్లో, రింకూ సింగ్ 19 (2 సిక్సులు, 1 ఫోర్) వేగంగా బ్యాటింగ్ చేయడంతో, ఆ జట్టు నిర్ణీత లక్ష్యానికి చేరుకుంది.
రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, తీక్షణ, పరాగ్, యుధ్వీర్ సింగ్ చరక్ తలా ఓ వికెట్ తీశారు.