LOADING...
Australian Open 2026: ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మహిళల విజేతగా రిబకినా
ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మహిళల విజేతగా రిబకినా

Australian Open 2026: ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మహిళల విజేతగా రిబకినా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2026
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కజకిస్థాన్‌ స్టార్‌ ఎలెనా రిబకినా కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ అరినా సబలెంకా (బెలారస్‌)పై 6-4, 4-6, 6-4 తేడాతో రిబకినా విజయం సాధించింది. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో కూడా వీరిద్దరే తలపడ్డారు. అప్పుడు సబలెంకా విజయం సాధించగా, ఆ ఓటమికి ఈసారి రిబకినా ప్రతీకారం తీర్చుకుంది. కీలక మ్యాచ్‌లో నిగ్రహంతో ఆడిన ఆమె చివరి సెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Details

రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం

కజకిస్థాన్‌ అమ్మాయికి ఇది రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం. ఇప్పటికే 2022లో వింబుల్డన్‌ ఛాంపియన్‌గా నిలిచిన రిబకినా, ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి తన ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక ట్రోఫీని చేర్చుకుంది. ఇదిలా ఉండగా.. అరినా సబలెంకా 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచి టైటిల్‌ను కాపాడుకుంది. 2025లో కూడా ఫైనల్‌కు చేరిన ఆమెకు అమెరికన్‌ ప్లేయర్‌ మాడిసన్‌ కీస్‌ ఊహించని షాక్ ఇచ్చింది. ఈసారి ఎలాగైనా గెలిచి మూడో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని సబలెంకా భావించినప్పటికీ, రిబకినా ఆ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో మహిళల టెన్నిస్‌లో కొత్త ఛాంపియన్‌గా రిబకినా తన సత్తాను మరోసారి నిరూపించుకుంది.

Advertisement