Page Loader
 Sara Tendulkar: సారా టెండూల్కర్ కు కొత్త బాధ్యతలు.. పోస్ట్‌ చేసిన సచిన్‌
సారా టెండూల్కర్ కు కొత్త బాధ్యతలు.. పోస్ట్‌ చేసిన సచిన్‌

 Sara Tendulkar: సారా టెండూల్కర్ కు కొత్త బాధ్యతలు.. పోస్ట్‌ చేసిన సచిన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2024
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కొత్త బాధ్యతలు స్వీకరించారు. ఆమె, సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ (STF) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సచిన్ చేసిన ట్వీట్ 

వివరాలు 

 క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన సారా 

''నా కుమార్తె సారా STF డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం నాకు గర్వకరమైన విషయం.ఈ విషయాన్ని మీతో పంచుకోవడం నాకు ఆనందాన్ని కలిగించింది.ఆమెకు వైద్య రంగంలో ఉన్న విద్యా పరిజ్ఞానం,సమాజానికి మరింత మేలు చేయడానికి,ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది'' అని సచిన్ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ సందేశానికి, చిన్నారులతో ఉన్న సారా ఫోటోలు కూడా జత చేశారు. సచిన్ తెందూల్కర్ ఫౌండేషన్, మారుమూల గ్రామాల్లోని పిల్లలకు వైద్య సేవలు అందిస్తూ, పోషకాహార లోపాన్ని తగ్గించడంలో సేవలు అందిస్తోంది. సారా తెందూల్కర్ లండన్‌లోని యూనివర్సిటీలో క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం, ఆమె ఫౌండేషన్‌లో భాగమవడం పట్ల సచిన్ తెందూల్కర్ చాలా ఆనందంగా ఉన్నారు.