Page Loader
సెహ్వాగ్‌ని బ్యాట్‌తో కొడతానని హెచ్చరించిన సచిన్ టెండుల్కర్
టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్

సెహ్వాగ్‌ని బ్యాట్‌తో కొడతానని హెచ్చరించిన సచిన్ టెండుల్కర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2023
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యకంగా పరిచయం అక్కర్లేదు. క్రీజులోకి దిగితే బౌండరీ వర్షం కురింపించే సెహ్వాగ్.. బ్యాటింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఎలాంటి బంతినైనా బౌండరికీ తరలించే వీరూ.. తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. టీమిండియాకు రెండు వరల్డ్ కప్‌లు అందించిన జట్టులోని సభ్యుడిగా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత మళ్లీ జట్టు ఆ స్థాయి ఓపెనర్‌ను తయారు చేయలేకపోయింది సెహ్వాగ్ 104 టెస్టులు ఆడి 8586 పరుగులు, 251 వన్డేల్లో 8273 పరుగులు, 19 టీ20ల్లో 394 పరుగులు చేశాడు. అతను తన చివరిగా మార్చి 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో మ్యాచ్‌లో ఆడాడు.

వీరేంద్ర సెహ్వాగ్

సిక్సర్‌తో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశా : వీరేంద్ర సెహ్వాగ్

ఇక ముల్తాన్ టెస్టు గురించి సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముల్తాన్ టెస్టులో తాను వంద పరుగుల మార్కును చేరడానికి ఆరు సిక్సర్లు కొట్టానని, ఆ సమయంలో సచిన్ మళ్లీ నువ్వు సిక్సర్ కొడితే బ్యాట్‌తో కొడతానని బెదరించడంతో 120నుంచి 295 పరుగుల మధ్యలో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదన్నారు. అయితే 295 వద్ద ఉన్నప్పుడు సిక్సర్ కొడతానని సచిన్‌తో చెప్పానని, అప్పుడు సచిన్ నీకేమైనా పిచ్చా అని, ఇండియా తరుపున ట్రిపుల్ సెంచరీ ఎవరూ చేయలేదని, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తనతో చెప్పారన్నారు. అయితే 295 కూడా ఎవరూ కొట్టలేదు కాదా అని, తాను సచిన్‌కు బదులిచ్చానని, అయితే ఆ మరుసటి బంతికే ముస్తాక్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి ట్రిపుల్ చేశానన్నారు.