Page Loader
రాహుల్‌ను విమర్శించిన మాజీ ప్లేయర్స్‌కి మాసాలా కావాలి : గౌతమ్ గంభీర్
కేఎల్ రాహుల్, వెంకటేష్ ప్రసాద్, గౌతమ్ గంభీర్

రాహుల్‌ను విమర్శించిన మాజీ ప్లేయర్స్‌కి మాసాలా కావాలి : గౌతమ్ గంభీర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 20, 2023
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ప్లేయర్ కేఎల్‌ రాహుల్‌కి టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. కేఎల్ రాహుల్ ఫామ్‌పై కొంతకాలంగా మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్, రాహుల్‌ని తీవ్రంగా విమర్శిస్తున్నాడు. పెద్దల అండతోనే రాహుల్ జట్టులో కొనసాగుతున్నాడని వెంకటేష్ ప్రసాద్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై గతంలో మాజీ క్రికెటర్ ఆశోక్‌చొప్రా స్పందించగా.. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఈ అంశంపై మాట్లాడారు. లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు టీమ్ గ్లోబెల్ మెంటార్ అయిన గంభీర్, రాహుల్‌ని వెనకేసుకొచ్చాడు. ఐపీఎల్లో రాహుల్ ఒత్తిడితో ఉంటాడా అని గంభీర్‌ని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, గతేడాది రాహుల్ సారథ్యంలో లక్నో ప్లేఆఫ్స్ వచ్చిందని తెలియజేశారు.

కేఎల్

కేఎల్ రాహుల్‌పై ఒత్తిడి లేదు

లక్నో టీం రన్ రేట్ ప్రకారగా గతేడాది మూడో స్థానంలో నిలిచిందని, రెండో స్థానంలో నిలిచి ఉంటే ఫైనల్ కు వెళ్లేందుుక రెండు అవకాశాలు దక్కేవని స్పోర్ట్స్ తక్ లో గంభీర్ మాట్లాడారు. ఐపీఎల్‌లో 1000 రన్స్ చేసినా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్లో రన్స్ చేయకపోతే విమర్శలు తప్పవని, ఇండియాకు ఆడే అవకాశం కేవలం 15మందికే దక్కుతుందని, ఐపీఎల్ లో 150 మందికి పైగా సెలెక్టర్ అవుతారని, ఈ రెండింటినీ పొల్చకూడదని గంభీర్ అన్నారు. కొన్నిసార్లు కొందరు మాజీలు యాక్టివ్ గా ఉండటానికి మసాలా కావాలని.. అందుకే వాళ్లు విమర్శలు చేస్తున్నారన్నారు.