Page Loader
తొలి వన్డేలో టీమిండియాను గెలిపించిన కేఎల్ రాహుల్
91 బంతుల్లో 75 పరుగులు చేసిన కేఎల్ రాహుల్

తొలి వన్డేలో టీమిండియాను గెలిపించిన కేఎల్ రాహుల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 17, 2023
09:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20, టెస్టులో వరుసగా విఫలమవుతూ టీమ్‌లో చోటు కోల్పోయిన టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ వన్డేల్లో సత్తా చాటాడు. 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియాని అద్భుత హాఫ్ సెంచరీతో ఆదుకొని.. కేఎల్ రాహుల్ ఘన విజయాన్ని అందించాడు. 91 బంతుల్లో 75 పరుగులు చేసి సత్తా చాటాడు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కలిసి ఆరో వికెట్ కి 108 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. జడేజా 69 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. 189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

కేఎల్ రాహుల్

రాణించిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా

హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ కలిసి ఐదో వికెట్‌‌కి 44 పరుగుల భాగస్వామ్యం జోడించినా.. హార్ధిక్ పాండ్యా భారీ షాట్ కి ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద కామెరూన్ గ్రీన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ కోహ్లీ, సూర్యకుమార్ నిరాశ పరిచగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చివరగా క్రీజులో ఉండి టీమిండియాను గెలిపించారు. వన్డేలో ఐదో స్థానంలో 17 ఇన్నింగ్స్ లను ఆడిన కేఎల్ రాహుల్ ఏడు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీని బాదాడు. టీమిండియాను లక్ష్యాన్ని 39.5 ఓవర్లో చేధించి, ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.